కొన్ని కొన్ని కాంబినేషన్ లు ఆసక్తికరంగా, వెయిట్ వర్దీగా వుంటాయి. అలాంటి వాటిలో మహేష్ బాబు-బోయపాటి కాంబినేషన్ ఒకటి. ఈ కాంబినేషన్ ను సాధ్యం చేయాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 14రీల్స్ సంస్థకు దర్శకుడు బోయపాటికి మాంచి సాన్నిహిత్యం వుంది. ఆ అనుబంధంతో మరోసారి బాలయ్య-బోయపాటి సినిమా చేయాలన్న ఆలోచన 14రీల్స్ లో వుంది. అయితే ఆ సినిమా 2018లో ఎన్నికల ముందు వుంటుంది. కానీ 14రీల్స్ నిర్మిస్తుందా, ఇంకెవరేనానా? అన్నది తేలాలి.
ఈలోగా మహేష్ బాబు పిలిచి మరీ, మంచి మనసుతో 14రీల్స్ కు తన 27వ సినిమా డేట్ లు ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకు డైరక్టర్ కావాలి. అందుకోసం బోయపాటి అయితే ఎలా వుంటుందీ అని డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. బోయపాటితో చర్చలు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బోయపాటి సూపర్ లైన్ రెడీ చేయాలే కానీ, మహేష్ బాబు మాత్రం కాదంటారా?
మాంచి మాస్ సినిమాలో మహేష్ ను చూసి చాలాకాలం అయింది. కొరటాల శివ, వంశీ పైడిపల్లి అంత నాటుమాస్ సినిమాను అయితే ఇవ్వరు. ఆ తరువాత త్రివిక్రమ్ కూడా అంతే. అందువల్ల బోయపాటి రైట్ ఛాయిస్ అనుకోవాలి 14రీల్స్ సంస్థకు. ఇక్కడ ఇంకో ముచ్చట వుంది. అసలు 14రీల్స్-మహేష్ కాంబినేషన్ కు చాలాకాలం క్రితం సుకుమార్ డైరక్టర్ అనుకున్నారు. కానీ ఎందుకో గాలి బోయపాటి వైపు మళ్లింది.