మహేష్‌ అతడిని నిలబెడతాడా?

చిన్న సినిమాలకి పెద్ద హీరోగా తీరిక లేకుండా నటించిన అల్లరి నరేష్‌ చాలా త్వరగా యాభై చిత్రాలు కంప్లీట్‌ చేసాడు. తన జనరేషన్‌ హీరోల్లో ఎంతమంది యాభై సినిమాలు చేస్తారనేది తెలియదు. అయితే ఇ.వి.వి.…

చిన్న సినిమాలకి పెద్ద హీరోగా తీరిక లేకుండా నటించిన అల్లరి నరేష్‌ చాలా త్వరగా యాభై చిత్రాలు కంప్లీట్‌ చేసాడు. తన జనరేషన్‌ హీరోల్లో ఎంతమంది యాభై సినిమాలు చేస్తారనేది తెలియదు. అయితే ఇ.వి.వి. సత్యనారాయణ చనిపోయిన తర్వాత అల్లరి నరేష్‌ గాడితప్పింది. అతను ఫెయిల్యూర్స్‌లో వున్నప్పుడల్లా ఇవివి ఒక సినిమా తీసి హిట్‌ ఇచ్చేవారు.

కానీ తండ్రి గైడెన్స్‌ లేని సమయంలో అల్లరి నరేష్‌ తన కెరీర్‌ని ఎలా మలచుకోవాలనేది తెలుసుకోలేకపోయాడు. అనుభవం వున్నా కానీ సక్సెస్‌ కాలేకపోయిన నరేష్‌ ప్రస్తుతం అవకాశాలు లేనిస్థితికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా అతను చూస్తున్నాడు. ఇలాంటి టైమ్‌లో అతనికి మహర్షిలాంటి భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

ఇందులో అతను మహేష్‌ స్నేహితుడిగా కనిపిస్తాడు. తన పాత్ర నిడివి తక్కువే అయినా కానీ కథ అంతా అతని చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలోని మొదటిపాట కూడా ఫ్రెండ్‌షిప్‌ గురించే వుండడం, అల్లరి నరేష్‌ ప్రాధాన్యతని తెలియజేస్తోంది. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకుని అల్లరి నరేష్‌ మళ్లీ మునుపటిలా బిజీ కాగలడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

ప్రజల సొమ్ముతో ప్రలోభాలు.. ఇదే నయా రాజకీయం!