మహేష్ బాబు స్వంత సంస్థ

టాలీవుడ్ లో ఎంబీ కార్పొరేషన్ అంటే చాలా మందికి తెలుసు. మోహన్ బాబు కార్పొరేషన్ అన్నమాట. ఇప్పుడు మరో ఎంబీ అనే సంస్థ వచ్చింపి. అది మహేష్ బాబుది. జి మహేష్ బాబు ఎంటర్…

టాలీవుడ్ లో ఎంబీ కార్పొరేషన్ అంటే చాలా మందికి తెలుసు. మోహన్ బాబు కార్పొరేషన్ అన్నమాట. ఇప్పుడు మరో ఎంబీ అనే సంస్థ వచ్చింపి. అది మహేష్ బాబుది. జి మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థను మహేష్ ప్రారంభించాడు. 

మహేష్ తన స్వంత సంస్థను ప్రారంభించే ఆలోచనలోవున్నట్లు 'గ్రేట్ ఆంధ్ర' చాలా రోజుల కిందటే ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ పేరు, లోగో, శ్రీమంతుడు టీజర్ తో బయటకు వచ్చాయి. మహేష్ కొడుకు గౌతమ్ పరుగెడుతున్నట్లు లోగోలో చిత్రాన్ని అమర్చారు. ఈ సంస్థ తొలి వెంచర్, శ్రీమంతుడులో పార్టిసిపేషన్ అని అనుకోవాలి. 

గతంలో మహేష్ తన డేట్లు సోదరుడు రమేష్ కు, సోదరి మంజులకు అప్పుడప్పుడు ఇస్తుండేవాడు. వాళ్లు సినిమా సమర్పిస్తుండేవారు. ఆ విధంగా వారికి ఆదాయం సమకూరేది. ఇప్పుడు మహేష్ ఈ సంస్థలను తన పిల్లల కోసం పెట్టినట్లు, వారికి ప్రత్యేక ఆదాయం దీని ద్వారా సమకూర్చాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.