Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ బాబు-వచ్చాడయ్యా సామి

మహేష్ బాబు-వచ్చాడయ్యా సామి

కొరటాల శివ అంటే మాంచి ఎమోషనల్ మాంటేజ్ సాంగ్ ఒకటి వుంటుంది. అవి అన్ని రెగ్యులర్ మాంటేజ్ సాంగ్ ల్లా వుండవు. జనాలు పాడుకునేలా వుంటాయి. బ్లాక్ బస్టర్ హిట్ లు అవుతాయి. మిర్చిలో ‘ దేవుడిలా దిగివచ్చాడు’ శ్రీమంతుడులో ‘పోరా శ్రీమంతుడా’ ఇలాంటివే. ఇప్పుడు మళ్లీ అలాంటి మ్యాజిక్ ను మరోటి తయారుచేస్తున్నాడు కొరటాల.

మహేష్ బాబు తన భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటిస్తున్న సినిమాలో, వచ్చాడయ్యా సామి అనే పాట ఒకటి తయారుచేసాడట కొరటాల. ఈపాటను అటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటు అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ చిత్రీకరించారు. ఇవ్వాళ, రేపు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం వేలాది మంది జనాలను సమీకరించడం విశేషం.

ఈ పాట భరత్ అనే నేనుకు టోటల్ హైలైట్ గా వుంటుందని తెలుస్తోంది. ఈ పాటకు కేవలం జూనియర్ ఆర్టిస్టులనే కాకుండా, బయట నుంచి బస్సులపై జనాలను తెప్పించినట్లు తెలుస్తోంది. అంతమంది జనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి పాట చిత్రీకరించారు. ఇంకా రెండు రోజుల వర్క్ వుండిపోతే దానిని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు.

భరత్ అనే నేను సినిమా ఏప్రియల్ 20న విడుదల అవుతుంది. వచ్చేనెల ఫస్ట్ వీకెండ్ లో అడియో ఫంక్షన్ వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?