Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబీకి అడ్వాన్స్.. సినిమా ఫిక్స్

బాబీకి అడ్వాన్స్.. సినిమా ఫిక్స్

ఉగాది పండగ పూటా డైరక్టర్ బాబీ (రవీంద్ర)కు అడ్వాన్స్ అందేసింది. నాగ్ చైతన్య-వెంకీ కాంబినేషన్ లో సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదిరిపోయింది. ప్రస్తుతం వెంకీ చేస్తున్న తేజ సినిమా తరువాత కానీ, లేదా అనిల్ రావిపూడి చేసే మల్టీస్టారర్ తరువాత కానీ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ పనిచేయాల్సింది. కానీ అతని కమిట్ మెంట్ ల వల్లకాలేదు. దాంతో బాబీ రంగంలోకి వచ్చారు.

ఈ సినిమాను కోన కార్పొరేషన్ సమర్పిస్తుంది. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తారు. దగ్గుబాటి సురేష్ బాబు బ్యానర్ సురేష్ మూవీస్ కూడా వన్ ఆఫ్ ది పార్టనర్ గా వుంటారు.

వెంకీతో సినిమా చేయడం కానీ, లేదా సురేష్ బ్యానర్ లో సినిమా చేయడం అన్నది కానీ నాగ్ చైతన్యకు చిరకాలం డ్యూగా వుండిపోయింది. ఇప్పుడు అది తీరిపోతోంది. దీనికి మిగిలిన స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్, హీరోయిన్ అన్నీ త్వరలో ఫైనల్ అవుతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?