మహేష్..బోణీ బాగుంది

జి. మహేష్ బాబు ప్రొడక్షన్స్ అంటూ నిర్మాణంలోకి దిగాడు హీరో మహేష్. తొలి సారిగా శ్రీమంతుడు అందించాడు. బోణీ బాగానే వుంది. పైగా ఈ సినిమా విషయంలో మహేష్ భార్య నమ్రత తీసుకున్న జాగ్రత్త…

జి. మహేష్ బాబు ప్రొడక్షన్స్ అంటూ నిర్మాణంలోకి దిగాడు హీరో మహేష్. తొలి సారిగా శ్రీమంతుడు అందించాడు. బోణీ బాగానే వుంది. పైగా ఈ సినిమా విషయంలో మహేష్ భార్య నమ్రత తీసుకున్న జాగ్రత్త లు కూడా తక్కువేమీ కాదు. ముఖ్యంగా పబ్లిసిటీని సవాల్ గా తీసుకున్నట్లు కనిపించింది. 

సినిమా విడుదల కాస్త దూరంగా వుండగానే మీడియాతో ఇంట్రాక్షన్ లు, అందరికీ పర్సనల్ ఇంటర్వూలు, ఇలాంటివి అన్నీ చాలా ప్లాన్డ్ గా చేసారు. దీంతో సినిమాకు గ్రాడ్యువల్ గా హైప్ ఆటోమెటీక్ గా వచ్చేసింది. ఇది సినిమా కు చాలా ప్లస్ అయ్యే అవకాశాలు వున్నాయి. మహేష్ ప్రచార శైలి గతంలో ఇలా వుండేది కాదు. ఈ సినిమాకు కొటి రూపాయిల వరకు ప్రచారానికే ఖర్చు చేసారని వినికిడి. మొత్తం మీద మహేష్ ప్రొడ్యూసర్ గా తొలి హిట్ కొట్టినట్లే.