క్లాసిక్‌ సినిమా గురించి చాగంటిగారేం చెబుతారో

మంచి సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకోవడంలో తప్పేం ఉంది. ఆయన ఏ షకీలా సినిమా గురించో మాట్లాడడం లేదు. మన తెలుగు సినిమా ప్రతిష్ఠను దేశమంతా గుర్తించేలా చేసిన గ్రేట్‌ క్లాసిక్‌…

మంచి సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకోవడంలో తప్పేం ఉంది. ఆయన ఏ షకీలా సినిమా గురించో మాట్లాడడం లేదు. మన తెలుగు సినిమా ప్రతిష్ఠను దేశమంతా గుర్తించేలా చేసిన గ్రేట్‌ క్లాసిక్‌ 'శంకరాభరణం' సినిమా గురించి ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రసంగీకులు శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు హైద్రాబాద్‌లోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ప్రవచనాలు చెప్పబోతున్నారట. 

టీవీల్లో శంకరుడితత్వం గురించి ఎంతో గొప్పగా బోధించే చాగంటిగారు కె.విశ్వనాధ్‌ అపూర్వ సృష్టి 'శంకరాభరణం'లో గల విశిష్ఠతను తెలియజేయడం గొప్ప సంగతే. ఇప్పటికీ చాలా మంది ప్రమఖులకు ఆహ్వానాలు కూడా అందాయట. ఒక ఆధ్యాత్మిక గురువు మొదటి సారి సినిమా గురించి ప్రవచనాల్లో మాట్లాడడం ఆసక్తిగా ఉంది. కె. విశ్వనాధ్‌ శివ భక్తుడు. గురువులు చాగంటి కోటేశ్వరరావు కూడా ఈశ్వరతత్వం గురించే ఎక్కువగా మాట్లాడతారు. ఇక శంకరాభరణం గురించి ఆయన చెప్పే ఆశక్తికర విషయాలు వినడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. 

ఇటీవల మాజీ రాష్ట్రపతి అబ్థుల్‌ కలాం గురించి కూడా గొప్పగా నివాళి అర్పించిన చాగంటిగారు 'శంకరాభరణం' లో శంకరశాస్త్రి వేశ్య అయిన మంజు భార్గవి పాత్రను ప్రేమించడాన్ని ఎలా సమర్ధిస్తారు. అలాగే తన కుమారై రాజ్యలక్ష్మి చంద్రమోహన్‌ని అంతకు ముందే ప్రేమించెయ్యడాన్ని ఎలా వివరించి వ్యాఖ్యానాలు చేస్తారోనని అందరికీ కుతూహలంగా ఉండడం సహజం. ఎందుకంటే 'శంకరాభరణం' సినిమా కూడా కొన్ని విషయాల్లో మిస్టరీ, సస్పెన్స్‌ ధ్రిల్లర్‌లాగే ఉంటుంది మరి.