Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్-కరోనా మార్చిన కథ?

మహేష్-కరోనా మార్చిన కథ?

నిన్నటికి నిన్న ఫస్ట్ లుక్ వచ్చింది, హీరో మహేష్ బాబు 'సర్కారువారి పాట' సినిమా నుంచి. చెవికి పోగు, కాస్త లాంగ్ హెయిర్ తో కనిపించాడు. అయితే ఇక్కడ ఇది కాదు విషయం. మెడ మీద రూపాయి కాయిన్ టట్టూ. ఇక్కడే విషయం వుంది. సినిమాకు ముందు అనుకున్న ప్రకారం కథ నేపథ్యం అమెరికాలో మొదలవుతుందని బోగట్టా. ఆ మేరకు హీరో మెడ మీద డాలర్ టట్టూ సింబల్ గా వుండాలని అనుకున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ కూడా కొంత అమెరికాలో వుండాల్సి వుంది.

అయితే కరోనా నేపథ్యంలో అమెరికాకు వీసాలు, షూటింగ్ లు అవీ ఎలా వుంటుందో తెలియదు. పరిస్థితి చూసి నిర్ణయం తీసుకోవాలి. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలన్నది ప్లాన్. ఈ లోగా సెట్ అయితే అమెరికా వెళ్తారు. లేదూ అంటే ఆల్టర్ నేటివ్ ప్లాన్ వుండనే వుంది. అందుకే ముందు జాగ్రత్తగా రూపాయి కాయిన్ సింబల్ వేసేసారని తెలుస్తోంది.

అమెరికాలో షూట్ చేసినా ఇండియన్ బిజినెస్ మెన్ కాబట్టి రూపాయి సింబల్ అనే లాజిక్ వాడుకోవచ్చు. ఇండియాలో షూట్ అయితే ఏ గొడవా లేదు. అదీ విషయం.

పేద‌ల‌కు మంచి జ‌ర‌గ‌డం చంద్ర‌బాబుకు ఇష్టం లేదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?