Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ సినిమా బాగా ఆలస్యం?

మహేష్ సినిమా బాగా ఆలస్యం?

దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ వర్క్ ట్రెండ్ కారణంగా సరిలేరు నీకెవ్వరూ సినిమా చకచకా ఫినిష్ అయిపోతోంది. ఎంత ఆలస్యం అవుతుంది అనుకున్నా, డిసెంబర్ నాటికి హీరో మహేష్ బాబు ఫ్రీ అయిపోతారు. మరి తరువాత సినిమా వెంటనే ప్రారంభమవుతుందా? అంటే నో అన్నదే సమాధానంగా వినిపిస్తోంది.

మహేష్ బాబు ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా వంశీ పైడిపల్లిది మాత్రమే. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడే ప్రారంభమైందని బోగట్టా. కనీసం ఆరునెలలు టైమ్ తీసుకుంటారని, వాస్తవం అయితే వంశీ స్క్రిప్ట్ తయారీకి అంతకన్నా ఎక్కువ టైమ్ నే తీసుకుంటారని టాక్. అందువల్ల ఎలాలేదన్నా మే నెల వస్తుందని అంటున్నారు.

మహేష్ బాబు తరువాత సినిమా మళ్లీ పండగ టార్గెట్ గా 2020 మేలోనే ప్రారంభమవుతుందని వినిపిస్తోంది. ఇదంతా ఓకె. వంశీ పైడిపల్లి సినిమా తరువాత రాజమౌళి సినిమా అన్నది ఫిక్స్. రాజమౌళి మే నుంచి 2021 ప్రారంభం వరకు స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ మహేష్ కోసం వేచివుండాల్సి వస్తుందేమో?

నిజానికి అనిల్ రావిపూడి లాంటి సూపర్ ఫాస్ట్ డైరక్టర్ ఎవరైనా దొరికితే, ఈ డిసెంబర్ నుంచి వచ్చే మేలోగా మహేష్ ఓ సినిమా చేసి విడుదల చేయవచ్చు. కానీ అలాంటి డైరక్టర్, అలాంటి స్క్రిప్ట్ దొరికినట్లు లేదు.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?