విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రాగానే జనాలకు గుర్తుకువచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. సినిమా లోగో, ఫస్ట్ లుక్ మళ్లీ ఆ సినిమా హ్యాంగోవర్ అనిపించాయి. ఈ విషయమై వార్తలు కూడా వచ్చేసాయి.
అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, డియర్ కామ్రేడ్ దారుణ పరాజయం తరువాత హీరో విజయ్ దేవరకొండ అర్జంట్ గా క్రాంతిమాధవ్ సినిమాను నిలబెట్టుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన వంగా సందీప్ ను రంగంలోకి దింపినట్లు తెలస్తోంది.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సలహాలు, సూచనలు, టచ్ అప్ లు చేసేపని అప్పగించినట్లు తెలుస్తోంది. ఇధ్దరికి మధ్య వున్న సాన్నిహిత్యంతో సందీప్ వంగా ఆ పని టేకప్ చేసినట్లు బోగట్టా. ఈ సినిమా హిట్ కొట్టి తీరాల్సిన అవసరం విజయ్ దేవరకొండకు ఎంతయినా వుంది.
ఇప్పటికే ఆటిట్యూడ్ పరంగా విజయ్ లో చాలామార్పు కనిపిస్తోంది. యంగ్ హీరోల మధ్య వున్న విపరీతమైన కాంపిటీషన్ రీత్యా ప్రతి సినిమా హిట్ కొట్టాల్సిందే. అందుకే సందీప్ వంగాను రంగంలోకి దింపినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.