మహేష్ ఓఫెనింగ్ అదిరింది

ఇప్పటి దాకా టీజర్ లేదా ఫస్ట్ లుక్ కూడా బయటకు రాలేదు మహేష్ బాబు-మురగదాస్ సినిమాకు సంబంధించి. సినిమా ఫినిష్ చేయడంలో బిజీగా వున్నారు నిర్మాతలు. టాక్స్ లు పోను 26 కోట్లకు హిందీ,…

ఇప్పటి దాకా టీజర్ లేదా ఫస్ట్ లుక్ కూడా బయటకు రాలేదు మహేష్ బాబు-మురగదాస్ సినిమాకు సంబంధించి. సినిమా ఫినిష్ చేయడంలో బిజీగా వున్నారు నిర్మాతలు. టాక్స్ లు పోను 26 కోట్లకు హిందీ, తెలుగు శాటిలైట్ మాత్రం అగ్రిమెంట్ చేసుకుని ఊరుకున్నారు. 

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఓన్లీ ఆంధ్ర సేల్ ను 36కోట్ల రేంజ్ లో స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. బోణీగా వెస్ట్ గోదావరి థియేటర్ రైట్స్  5కోట్ల 40లక్షలకు అగ్రిమెంట్ అయినట్లు తెలుస్తోంది. అంటే ఇక ఆంధ్ర అంతా ఈ 36 కోట్ల రేంజ్ లోనే వెళ్తుందన్నమాట.

ఇదిలా వుంటే తమిళనాట, మురగదాస్ కు వున్న క్రేజ్ తో 18కోట్ల రేంజ్ లో ఆఫర్లు వస్తున్నాయట. అయితే పోటీ కాస్త బాగుండడంతో మరి కాస్త వస్తుందా అనే ఆలోచనలతో వెయిటింగ్ లిస్ట్ లో వుంచారట. మళయాలం మరో రెండుకు అగ్రిమెంట్ స్టేజ్ లో వుందట. ఇధికాక తమిళ్, మలయాళం శాటిలైట్ వుండనే వుంది. 

అంటే ఆంధ్ర 36, నైజాం 20కు కాస్త అటుగా, తమిళ్ 18, కేరళ 2, తెలుగు, హిందీ శాటిలైట్ 26, ఇప్పటికి తేలిన ఫిగర్లు. అంటే ఇక్కడికే 102 కోట్ల బిజినెస్ రెడీ అయిపోయింది. 
ఇంకా సీడెడ్, తమిళ్ మళయళం శాటిలైట్ వుంటుంది. ఈ రెండు కలిపి హీనంలో హీనం 20 దాకా వస్తుందని అంచనా వేస్తున్నారట. అంటే టోటల్ బిజినెస్ 122కోట్ల రేంజ్ అన్నమాట.
సో, తెలుగు సినిమాల్లో నాన్ బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ మహేష్ దే అవుతుందేమో?