మహేష్ సినిమాటోగ్రాఫర్ అవుట్?

మహేష్-కొరటాల శివ సినిమా భరత్ అనే నేను. ఇప్పుడు ఈ సినిమాకు చిన్న సెట్ బ్యాక్. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రవి కే వర్మన్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు…

మహేష్-కొరటాల శివ సినిమా భరత్ అనే నేను. ఇప్పుడు ఈ సినిమాకు చిన్న సెట్ బ్యాక్. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రవి కే వర్మన్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య దర్శకులకు సినిమాటోగ్రాఫర్లకు నప్పక, ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం కామన్ అయిపోయింది. పెద్ద డైరక్టర్లు అంతకన్నా పెద్ద సినిమాటోగ్రాఫర్లను ఏరి కోరి తెచ్చుకుంటారు. దీంతో సీన్ల దగ్గర బేధాభిప్రాయాలు వచ్చేస్తాయి. వన్ ఫైన్ మార్నింగ్ ప్రాజెక్టు నుంచి తప్పకుంటారు. 

జనతా గ్యారేజ్ టైమ్ లో కూడా సినిమాటోగ్రాఫర్ మాథి వుండేవాడు. అంతకు ముందు కూడా కొరటాల శివకు అతనే పని చేసాడు. కానీ జనతా గ్యారేజ్ టైమ్ లో ఇద్దరికీ పొసగలేదు. తిరును తెచ్చుకున్నాడు. ఇఫ్పుడు భరత్ అనే నేను సినిమాకు కూడా రవి కే వర్మన్ ప్లేస్ లో తిరు వచ్చి చేరినట్లు తెలుస్తోంది. దీనివల్ల నిర్మాతకే సమస్య. ఒప్పుకున్న ప్రకారం ఫుల్ పేమెంట్ ఇచ్చి పంపాలి. కొత్త వాళ్లకి మళ్లీ పేమెంట్ ఇవ్వాలి.

అ.. ఆ టైమ్ లో ఇలాగే జరిగింది. చివర్లో నటరాజ్ సుబ్రహ్మణ్యం వెళ్లిపోతే, బాలీవుడ్ నుంచి మరొకర్ని తెచ్చి పూర్తి చేసారు. రాజీవన్ ఆర్ట్ డైరక్టర్ అనుకుంటే, మార్చి ప్రకాష్ ను తెచ్చుకున్నారు. అన్నీ డబుల్ డబుల్ పేమెంట్లు. భరత్ అనే నేను సమ్మర్ విడుదలకు రెడీ అవుతోంది. మరి ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ మారడం వల్ల ప్రాజెక్టు ఏమైనా డిలే అవుతుందేమో చూడాలి.