అభిమాన హీరో గురించి ఎంత తెలుసుకున్నా, ఇంకా తెలుసుకోవాలనే వుంటుంది అభిమానులకు. ఎందుకంటే వారి అభిమానం అలాంటిది. అందుకే మీడియా కూడా హీరోల మచ్చట్లు ఎన్ని తెలియచేసినా, ఇంకా సమ్ థింగ్ ఏం వుందో అని ప్రయత్నిస్తూనే వుంటుంది.
హీరో మహేష్ కు సంబంధించి చిన్న ముచ్చట ఇది. మహేష్ బాబు ఫక్తు ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. పైగా ఏడాదికి కనీసం మూడు నాలుగు సార్లయినా ఫ్యామిలీతో టూర్ వేస్తుంటాడు. భార్య అన్నా, పిల్లలన్నా మహేష్ కు టాప్ ప్రయారిటీ. ఎంత ప్రయారిటీ అంటే, హైదరాబాద్ లో షూట్ అయితే మాత్రం మార్నింగ్ పది తరువాతే పెట్టుకోమంటాడట.
మరీ తప్పనిసరి అయితే వేరే సంగతి. మాగ్జిమమ్ పది తరువాతే బయటకు వస్తాడట. ఇలా చేయడానికి కారణం లేట్ గా నిద్రపోవడమో, లేట్ గా లేవడమో కాదట. మహేష్ పిల్లలు గౌతమ్, సితార రెడీ అయి, స్కూళ్లకు వెళ్లిన తరువాతే బయటకు రావాలన్నది కారణమట. వాళ్లు స్కూళ్లకు వెళ్లే వరకు ఇంట్లోనే వుంటాడట మహేష్. అదీ సంగతి.