రవితేజ కోసం ‘ క్రాక్ ‘ ?

టైటిళ్ల కోసం భలే వెదుకులాట వుంటుంది టాలీవుడ్ లో. జనాలకు ఇట్టే పట్టే టైటిళ్ల కోసం తెగ వెదుకుతుంటారు. ఆలోచిస్తుంటారు. లేటెస్ట్ గా టాలీవుడ్ చాంబర్ లో ఓ కొత్త టైటిల్ రిజిస్టర్ అయిందని…

టైటిళ్ల కోసం భలే వెదుకులాట వుంటుంది టాలీవుడ్ లో. జనాలకు ఇట్టే పట్టే టైటిళ్ల కోసం తెగ వెదుకుతుంటారు. ఆలోచిస్తుంటారు. లేటెస్ట్ గా టాలీవుడ్ చాంబర్ లో ఓ కొత్త టైటిల్ రిజిస్టర్ అయిందని వినికిడి. ఆ టైటిల్ కాస్త డిఫరెంట్ గా వుంది. క్రాక్..ఇదీ టైటిల్. 

మరి ఈ టైటిల్ ఎవరి కోసం రిజస్టర్ చేయించి వుంటారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే రవితేజ కోసం అని వినికిడి. ప్రస్తుతం రవితేజ ఓ సినిమా పవర్ బాబి డైరక్షన్లో చేస్తున్నాడు. మరి ఆ సినిమా కోసమా కాదా అన్నది తెలియదు. ఇది కాక ఓ మాంచి సబ్జెక్ట్ ఒకటి రవితేజ కు దొరికిందని దానికోసం కూడా అయి వుండవచ్చని వినికిడి. 

ఏమయితేనేం..మాంచి మాస్ మసాలా టైటిల్ మాదిరిగా బాగానే వుంది ఈ క్రాక్ అన్నది. కిక్, పవర్, మాదిరిగా క్రాక్ అన్నమాట.