పెద్ద హీరోల కోసం ఏళ్ల తరబడి వెయిటింగ్ లో కూర్చోవడం అన్నది ఇక అంతగా వుండకపోవచచ్చు. ముఖ్యంగా ఇంతో అంతో సత్తా వున్నవారు అస్సలు వేచి వుండే పరిస్థితి లేదు. అలాగే కథలు రిజెక్ట్ చేసినా, వచ్చిన నష్టం లేదు.
మరో హీరో అవకాశం ఇస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇలాగే ఇప్పటికి రెండు షాక్ ల తగిలాయి. సుకుమార్ చెప్పిన కథ నచ్చలేదు. కానీ అలా అని సుకుమార్ అక్కడే వుండి మరో కథ వండలేదు.
హ్యపీగా బన్నీతో సినిమాను పట్టు పట్టి అనౌన్స్ చేయించారు. ఇప్పుడు అలా అనౌన్స్ అయిన పుష్ప సినిమా క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఈ సినిమా తరువాత మహేష్ పిలిచి మరీ సుకుమార్ తో సినిమా చేయాల్సి వస్తుందేమో?
మహర్షి సినిమా తరువాత వంశీ పైడిపల్లిదీ అదే పరిస్థితి. కథ నచ్చలేదని అటు ఇటు తిప్పాడు మహేష్. తరువాత పక్కన పెట్టాడు. ఇప్పుడు ఏకంగా టాప్ స్టార్ విజయ్ తో ద్విభాషా సినిమా వంశీ పైడిపల్లి చేతిలోకి వచ్చింది.
గమ్మత్తేమిటంటే మహేష్ తో వరుసగా సినిమాలు చేసిన బ్యానర్ లే మహేష్ కాదన్న దర్శకులకు అండగా నిలిచాయి. మైత్రీ మూవీస్ పుష్ప సినిమాను సుకుమార్ కు సెట్ చేస్తే, దిల్ రాజు వంశీపైడిపల్లికి విజయ్ సినిమా సెట్ చేసారు.
తనతో సినిమా వద్దు అని అడ్వాన్స్ వెనక్కు పట్టుకెళ్లిన హారిక హాసిని బ్యానర్ కు, దర్శకుడు త్రివిక్రమ్ కే మహేష్ పిలిచి మరీ సినిమా చేయాల్సి వస్తోంది.