Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ కోసం 'వెంకీ ఎపిసోడ్'

మహేష్ కోసం 'వెంకీ ఎపిసోడ్'

శ్రీను వైట్ల సినిమాల్లో వెంకీ సినిమా, అందులో ట్రయిన్ ఎపిసోడ్ జనాలు అంత సులువుగా మర్చిపోరు. బ్రహ్మీ, ఎవిఎస్, శ్రీనివాసరెడ్డి, రవితేజ తో పాటు చాలా మంది కమెడియన్ల కలిసి ఆ ట్రయిన్ ఎపిసోడ్ లో చేసిన అల్లరి ఇంతా అంతా కాదు. ఇప్పటికి యూ ట్యూబ్ లో ఆ సీన్లు ఫుల్ పాపులర్.

శ్రీను వైట్ల తరువాత మళ్లీ కమర్షియల్ కామెడీ పల్స్ ను ఫుల్ గా పట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఫన్ అంతా శ్రీను వైట్ల మీటర్ లో వుంటుందని టాక్ వినిపిస్తోంది.

అదే విధంగా ఈ సినిమాలో వెంకీ ట్రయిన్ ఎపిసోడ్ లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సీన్లు హిలేరియస్ గా వుండేలా  ప్లాన్ చేస్తున్నారని, బండ్ల గణేష్, ఇంకా ఒకరిద్దరు కమెడియన్లు, మహేష్ తో పాటు ఈ సీన్లలో పాలు పంచుకుంటారని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సెకండాఫ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా షూట్ జూన్ నుంచి ప్రారంభమవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?