విజయ్ దేవరకొండ సినిమాల్లోనే భారీ చిత్రంగా చెప్పుకునే సినిమాకు రేపు శ్రీకారం చుడుతున్నారు.
మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించే ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఆనంద్ పని చేస్తారు. ఈ సినిమాలో విజయ్ బైక్ రైసర్ గా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు రేపు శ్రీకారం చుట్టి, ఈనెల 22 నుంచి రెండు బైక్ రేసింగ్ సీన్లు చిత్రీకరణను ఢిల్లీలో ప్రారంభించబోతున్నారు. ఈ రెండు సీన్లకే దాదాపు ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
ఇందుకోసం విదేశాల నుంచి బైక్ రేసర్లను, డ్రోన్ లను, ఆపరేటర్లను, స్కార్పియో ఎక్విప్ మెంట్ ను తెప్పిస్తున్నారు. కేవలం రైస్ ట్రాక్ మీద షూటింగ్ పర్మిషన్ కే కోటికి పైగా చెల్లించినట్లు తెలుస్తోంది.
మైత్రీమూవీస్ లో విజయ్ కు ఇది రెండో సినిమా. డియర్ కామ్రేడ్ పూర్తయింది. జూలై లో విడుదలకు రెడీ అవుతోంది.
క్రాంతిమాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమా సెట్ మీద వుంది. దానికి ఇంకా టైమ్ కూడా పడుతుంది. ఆ సినిమాతో సమాంతరంగా ఈ బైక్ రేసర్ సినిమాను కూడా ఫినిష్ చేస్తారు.
ఇప్పటికే నాని హీరోగా మైత్రీ మూవీస్ ఓ యాభై కోట్ల ప్రాజెక్టును విక్రమ్ కుమార్ తో నిర్మిస్తోంది. ఇప్పుడు విజయ్ తో కూడా అంత కన్నా ఎక్కువ రేంజ్ ప్రాజెక్టును టేకప్ చేసింది.