Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ మరో రెండు సినిమాల ప్లానింగ్

మహేష్ మరో రెండు సినిమాల ప్లానింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రెండు సినిమాలను ఓకె చేసే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ఒక సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాను ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు..మురగదాస్ డైరక్ట్ చేస్తారు. ఇది కాక వంశీ పైడిపల్లి డైరక్షన్ లో పివిపి నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి చర్చలు సాగుతున్నాయి. 

అలాగే డైరక్టర్ ఫిక్స్ కాలేదు కానీ, నిరంజన్ రెడ్డి నిర్మాతగా మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇంకా డైరక్టర్ ఎవరు అన్నది ఫిక్స్ కాలేదు. మహేష్ దగ్గర మాట తీసుకున్న డైరక్టర్లలో పూరి ఒక్కరే వున్నారు. కొరటాల శివతో ఓ సినిమా చేయడానికి మహేష్ ఫిక్స్ అయ్యారని, అదే ఈ రెండో సినిమా అని కూడా వినిపిస్తోంది. మరి ఆయనే చేస్తారా? లేక మరెవరు? అన్నది తెలియాలి.  ఇదిలా వుంటే మహేష్ బాబు నిర్మాత అశ్వనీదత్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. అది ఎప్పటి నుంచో అలా వెనక్కు వెళ్తోంది. 

మరి ఇప్పుడు రెండు సినిమాలు కమిట్ అయిపోతే, చేతిలో వున్న మురగదాస్ సినిమాతో కలిపి మూడు సినిమాలు..అంటే చాలా టైమ్ పట్టేస్తుంది. అయితే వీటి మధ్యలో అశ్వనీదత్ సినిమా వుంటుందో..లేదా వెనక్కు వెళ్తుందో తెలియాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?