మొన్నటి వరకూ ఆర్నాల్డ్ ష్వ్కార్జ్ నెగ్గర్ అంటూ చాలా అతే చేశారు తమిళ తంబీలు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న రోబో పార్ట్ టూ విషయంలో ఆర్నాల్డ్ పేరు ను ఒక రేంజ్ లో వాడేశారు. అంతా అయిపోయిందని.. రజనీ సినిమాలో ఆర్నాల్డ్ విలన్ గా నటించడానికి సై అన్నాడని.. ఇందుకు సంబందించి అగ్రిమెంటు కుదిరిందని ప్రచారం చేశారు.
రజనీ, శంకర్ సినిమాలో నటించడానికి ఆర్నాల్డ్ వంద రోజుల సమయాన్ని కేటాయించాడని కూడా చెప్పేశారు. దీనికి రికార్డు స్థాయి పారితోషకాన్ని కూడా ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరిగింది!అయితే .. అదంతా ఉత్తిదే అని ఆ తర్వాత స్పష్టత వచ్చింది. తమిళనాడుకు వేరే ప్రోగ్రామ్ కు వచ్చి.. “ఐ’ సినిమా కు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే సరికి ఆర్నాల్డ్ విషయంలో ఇలాంటి ప్రచారాన్ని గట్టిగా చేసేశారు. ఆ తర్వాత మాత్రం అందులో పస లేదని తేలింది.
హాలీవుడ్ హీరో చేస్తాడన్న ఆ పాత్రను ఇప్పుడు బాలీవుడ్ హీరోకి ఇచ్చి సినిమా పూర్తి చేస్తున్నారు. మరి ఆ ప్రచారానికి అలా తెర పడగా ఇప్పుడు మళ్లీ రజనీ కాంత్, జాకీ చాన్ అంటూ మరో అంతర్జాతీయ స్థాయి స్టార్ ను తంబీలు వాడేస్తున్నారు. మలేసియా నిర్మాత అని ఈ సినిమా ఇంగ్లిష్ లో తెరకెక్కుందని అంటున్నారు. మరి ఇది వరకూ ఆర్నాల్డ్ విషయంలో జరిగిన ప్రచారాన్ని బట్టి చూస్తే మాత్రం ఇది అంత నమ్మశక్యమైన ప్రచారం లా అయితే కనిపించడం లేదు.