భరత్ అనే నేను సినిమా ఫంక్షన్ దగ్గరకు వచ్చేసింది. ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ వస్తున్నాడన్నది దాదాపు పక్కా అయింది. లాస్ట్ మినిట్ చేంజెస్ వుంటే తప్ప. రామ్ చరణ్ ఏదో టూర్ ప్లాన్ చేస్తున్నాడని వినికిడి. అది లేకపోతే వస్తాడని టాక్.
ఈ సంగతి అలావుంటే ఎన్టీఆర్ గెస్ట్ గా రావడం అన్నది ఫ్యాన్స్ మధ్య డిస్కషన్లకు దారి తీస్తోందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమా ఫంక్షన్ లకు ఎవరో ఓ పెద్ద దిక్కును పిలవడం ఆనవాయతీగా వస్తోంది. దాసరి పోయిన తరువాత ఫంక్షన్లకు పెద్దదిక్కు అన్నది లేకుండా పోయింది. దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, అల్లు అరవింద్ లాంటి వారే వస్తున్నారు. మరీ టాప్ హీరోలు అయితే ఎవ్వరినీ పిలవడంలేదు. కొన్నింటికి మెగాస్టార్ వస్తున్నారు.
అలాంటిది ఒకే రేంజ్ హీరోల సినిమాలకు అదే రేంజ్ హీరోలు రావడం అన్నా, పిలవడం అన్నా కాస్త కొత్తగావుంది. ఇది మంచి పరిణామమే కావచ్చు. కానీ ఫ్యాన్స్ లో డిస్కషన్ కు తావిస్తోంది. పైగా రెండు భయంకర డిజాస్టర్ల తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా. ఎంత కొరటాల మీద భరోసా వున్నా కూడా ప్యాన్స్ కు కాస్త అలజడిగానే వుంది. పైగా రంగస్థలం లాంటి హిట్ తరువాత రావడం మరోటి.
ఇలాంటి టైమ్ లో మహేష్ కోరి ఎన్టీఆర్ ను సభకు రమ్మని పిలిచారు అంటున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ లెవెల్లో ఏముంటుంది. మహేష్ తప్పని సరై ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకున్నారు అని టాక్ వస్తుంది. అందుకే ఎన్టీఆర్ ను మహేష్ పిలవలేదు, కొరటాలే పిలిచాడు అన్నది స్ప్రెడ్ కావాలని భరత్ అనే నేను యూనిట్ ప్రయత్నిస్తోంది.
కాదు, నేరుగా మహేష్ నే అడిగాడు. అందుకే ఎన్టీఆర్ కాదనలేకపోయారు, అని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మహేష్ తన సినిమా ఫంక్షన్ కోసం ఎన్టీఆర్ ను పిలిచాడు అన్నదే ప్రొజెక్ట్ అయ్యేలా ఎన్టీఆర్ యూనిట్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని వినికిడి. ఇది మహేష్ ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందిగానే వుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం భరత్ అనే నేను యూనిట్ లో డిస్కషన్ పాయింట్ గా మారిందని తెలుస్తోంది.
మరో రెండురోజులు సమయం వుంది. ప్రస్తుతానికి లోలోపల వున్న ఈ డిస్కషన్లు పైకి తేలితే, ఎన్టీఆర్ హాజరు కావడంలో తేడా వచ్చినా రావచ్చు.