సినిమాకు కాస్త బజ్ వుంటుంది, కిక్కు వుంటుంది అని ఛల్ మోహన్ రంగాకు త్రివిక్రమ్ పేరు జోడించారు. అలాగే పవన్ కళ్యాణ్ పేరు కూడా. అయితే ఇదంతా నేతి బీరకాయలో నెయ్యి, మైసూర్ బజ్జీలో మైసూర్ లాంటి వ్యవహారం అని ఇండస్డ్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. కథ కృష్ణ చైతన్యదే అని, పెట్టుబడి మొత్తం నితిన్ కుటుంబానిదే అని గుసగుసలు వున్నాయి.
కానీ ఇప్పుడు విషయం వేరే వుంది. నిన్నటికి నిన్న ఐపిఎల్ ప్రోమో వచ్చింది. దీనికి డైరక్టర్ త్రివిక్రమ్ నే. ఇది చూసిన వాళ్లు, మరో అజ్ఞాతవాసి అనే టైపులో కామెంట్ లు చేస్తున్నారు.
ఇప్పుడు అంతా బాగుండి ఛల్ మోహన్ రంగా బాక్సాఫీస్ దగ్గర, క్రిటిక్స్ టాక్ పరంగా బాగుంటే ఫరవాలేదు. అలా కాకపోతే కనుక, డైరక్టర్ కృష్ణ చైతన్య మీద కన్నా త్రివిక్రమ్ మీద ఎక్కువ ఫ్రభావం చూపించే అవకాశం వుంది.
ఎందుకంటే ఛల్ మోహన్ రంగా ట్రయిలర్ చూసిన వారు, ఆ పంచ్ లు, ఫన్ డైలాగులు చూసి, త్రివిక్రమ్ చేయివేసాడు. త్రివిక్రమ్ స్టయిల్ అన్నారు. అలా అన్నపుడు బాగానే వుంటుంది. తేడావస్తే, అది కూడా త్రివిక్రమ్ ఖాతాలో పడిపోతుంది. అప్పుడు వస్తుంది అసలు మజా.