మహేష్-సమంత-త్రివిక్రమ్

ఇలా అనగానే మాంచి సూపర్ డూపర్ కాంబినేషన్ అని అభిమానులు గెంతులు వేయద్దు..ఈ కాంబినేషన్ నిజమే కానీ, సినిమాగా కాదు. ఓ స్కిట్ గా మాత్రమే.మేము సైతం అంటూ టాలీవుడ్ చేస్తున్న హుద్ హుద్…

ఇలా అనగానే మాంచి సూపర్ డూపర్ కాంబినేషన్ అని అభిమానులు గెంతులు వేయద్దు..ఈ కాంబినేషన్ నిజమే కానీ, సినిమాగా కాదు. ఓ స్కిట్ గా మాత్రమే.మేము సైతం అంటూ టాలీవుడ్ చేస్తున్న హుద్ హుద్ బాధితుల సహాయ కార్యక్రమంలో తమ వంతుగా ఈ ముగ్గురూ కలిసి ఓ స్కిట్ చేస్తున్నారు. 

అయితే ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా వుంచారు. ఆ ముగ్గురు మాత్రమే ఒకరికి ఒకరు టచ్ లో వుండి దాన్ని రూపొందిస్తున్నారు. దాని వ్యవహారం మొత్తం త్రివిక్రమ్ కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు. 

ఎలా అయితేనేం ఆ కార్యక్రమం ఓ రేంజ్ లో వుంటుందనడంలో సందేహం లేదు. స్కిట్ లు తయారు చేయడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు..అత్తారింటికి దారేదిలో అహల్య స్కిట్ ను ఇప్పటికీ జనాలు మరిచిపోలేరు కదా.