మహేష్ తో బన్నీ ఢీ-ఇది ఫిక్స్

సినిమా ఏదైనా, రిలీజ్ టైమ్ ఏదయినా, సీజన్ ఏదయినా, మరోసారి మహేష్ సినిమాతో బన్నీ ఢీ అన్నది ఫిక్స్. బన్నీ క్యాంప్ వైపు నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మరోసారి మహేష్ సినిమాను ఢీకొట్టి…

సినిమా ఏదైనా, రిలీజ్ టైమ్ ఏదయినా, సీజన్ ఏదయినా, మరోసారి మహేష్ సినిమాతో బన్నీ ఢీ అన్నది ఫిక్స్. బన్నీ క్యాంప్ వైపు నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మరోసారి మహేష్ సినిమాను ఢీకొట్టి తనేంటో, తన సినిమా సత్తా ఏమిటో చూపించాలని బన్నీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సంక్రాంతికే బన్నీ-మహేష్ సినిమాలు ఢీ అంటే ఢీ అన్నాయి. ఒక దశలో రెండు సినిమాలు ఒకే రోజు వచ్చే అవకాశం కనిపించింది. 12 కాకుండా 10న విడుదల చేద్దామని బన్నీ సినిమా యూనిట్ అనుకోవడం, అదే రోజు మనమూ వేసేద్దామని మహేష్ అన్నారంటూ వార్తలు రావడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రంగప్రవేశం చేసి, మొత్తం మీద పరిస్థితిని చక్కదిద్దారు.

తొలిరోజు దాదాపు 80శాతం థియేటర్లలో సరిలేరు సినిమాను విడుదల చేసి, రోజుకు ఏడు ఆటలు వేసి, మాంచి ఫిగర్లు రప్పించారు. కానీ సినిమా పరంగా అల వైకుంఠపురం మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా మహేష్ బాబు కింగ్ అనుకునే ఓవర్ సీస్ లో పూర్తిగా దెబ్బతీసింది. 

సినిమా ఏదయినా తెలుగు రాష్ట్రాల అంకెలు అన్నది ఓ బ్రహ్మపదార్థం. ఎవరికి తొచిన అంకెలు వాళ్లు ప్రచారం చేసేసుకోవడమే. అందుకే ఈసారి ఈ రెండు పెద్ద సినిమాల అంకెలను ఏ మీడియా కూడా సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఓవర్ సీస్ అలా కాదు. పక్కా. 

ఇలాంటి నేపథ్యంలో బన్నీ మరోసారి తన సినిమాను మహేష్ సినిమా మీద వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో రాబోయే సినిమాల్లో ఒకదాన్ని మహేష్ సినిమా ఎప్పుడు వుంటే అప్పుడు వేయాలని బన్నీ ఆలోచిస్తున్నట్లు బోగట్టా. ఈ మేరకు తన సన్నిహితుల దగ్గర మళ్లీ మరోసారి మన సినిమా వేసి సత్తా చూపిద్దాం అని అన్నట్లు గ్యాసిప్ వినిపిస్తోంది.

మహేష్ ఎక్కడో ఎప్పుడో బన్నీని కామెంట్ చేసారన్న గ్యాసిప్ ఇండస్ట్రీలో వుంది. ఇది ఎంతవరకు నిజం అన్నది ఎవరికీ తెలియదు. కానీ దీనికే బన్నీ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. సో, రాబోయే సంక్రాంతికి మరోసారి బన్నీ-మహేష్ సినిమాల ఫైట్ వుంటుందేమే.

పిల్లల్ని మార్చడం అనేది చాలా పాత ఐడియానే