Advertisement

Advertisement


Home > Movies - Movie News

డిస్కోరాజా..డిస్కోసాంగ్

బాలీవుడ్ దర్శకులు ఎంతో మంది తెలుగు సినిమాలకు పాటలు అందించారు. కానీ బప్పీలహరి సంగతి వేరు. తెలుగు మాస్ ప్రేక్షకులకు దగ్గరయిన ఏకైక ఉత్తరాది సంగీత దర్శకుడు ఆయన. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి హీరోల సినిమాలకు ఉర్రూతలూగించే పాటలు అందించిన మ్యూజిక్ డైరక్టర్ బప్పీలహరి. కాలం మారింది ఎవరెవరో, ఎందరెందరో, కొత్త కొత్త మ్యూజిక్ డైరక్టర్లు వచ్చారు.

అయినా బప్పీలహరి పాటలను జనం మరిచిపోలేదు.ఇలాంటి నేపథ్యంలో మళ్లీ మరోసారి బప్పీలహరి గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు డిస్కోరాజా మేకర్లు. నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకుడు విఐ ఆనంద్, కలిసి డిస్కోరాజా సినిమా కోసం ఇప్పటికే ఓ వింటేజ్ సాంగ్ తయారుచేసారు. ఎస్పీబీ పాడిన 'నాతో ఏం అన్నావో' అనే ఆ పాట బాగా వైరల్ అవుతోంది.ఇప్పుడు మరో వింటేజ్ ట్యూన్ అనేట్లుగా బప్పీ లహరితో ఓ పాట అందించారు.

ఈ పాటను కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయడం విశేషం. 'కాలం ఆగాలి నా కాలి వేగం చూసి..లోకం ఆగాలి నా వేలి సైగే చూసి' అంటూ సాగే ఈ పాటను హీరో రవితేజ తో కలిసి బప్పీలహరి పాడారు. బప్పీలహరి స్టయిల్ ను గుర్తుకు వచ్చేలా థమన్ ట్యూన్ అందించారు.ఒక సీనియర్ హీరో, ఒక యంగ్ హీరో అనేట్లుగా రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు రవితేజ ఈ సినిమాలో అందుకు తగినట్లుగానే థమన్ రెండు వింటేజ్ ట్యూన్ లు అందించారు. ఈ నెల మూడోవారంలో డిస్కోరాజా సినిమా థియేటర్లలోకి వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?