పాపం మహేష్‌! ఆ ఒక్క కోరిక తీరలేదు!

మహేష్‌బాబు తొలిసారిగా ఉభయభాషా చిత్రం చేస్తున్నారు. తెలుగులో టాప్‌ హీరోల్లో ఒకరిగా ఎంత క్రేజ్‌ ఉన్నప్పటికీ.. ఆయన ఎన్నడూ పరభాషా ఇండస్ట్రీల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు తాను నిర్మాతగా కూడా…

మహేష్‌బాబు తొలిసారిగా ఉభయభాషా చిత్రం చేస్తున్నారు. తెలుగులో టాప్‌ హీరోల్లో ఒకరిగా ఎంత క్రేజ్‌ ఉన్నప్పటికీ.. ఆయన ఎన్నడూ పరభాషా ఇండస్ట్రీల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు తాను నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న 'శ్రీమంతుడు' చిత్రంతో మహేష్‌ తమిళంలోకి స్ట్రెయిట్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో మహేష్‌ చేసిన అనేక చిత్రాలు తమిళంలో రీమేక్‌ అయి ఘనవిజయాలు సాధించాయి. కొన్ని చిత్రాలు డబ్‌ అయ్యాయి కూడా. అయితే స్ట్రెయిట్‌గా తెలుగుతో పాటూ శ్రీమంతుడు మాత్రమే సేండేట్‌ అక్కడ తమిళ వెర్షన్‌ విడుదల అవుతోంది. 

సినిమాలో కంటెంటో యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ అయినందున మాత్రమే తమిళంలో కూడా స్ట్రెయిట్‌ రిలీజ్‌ చేస్తున్నామని మహేష్‌ అంటున్నాడు. మరి ఇదివరకు చిత్రాలు కూడా అంతే కదా! అలా కాకపోతే.. రీమేక్‌ చేసినప్పుడు మాత్రం ఎలా ఆడగలిగాయి అనే సందేహం అభిమానులకు కలుగుతుంది. ఎందుకంటే వారంతా ఎప్పటినుంచో.. మహేష్‌ రెండు రాష్ట్రాల హీరోగా వెలగాలని కోరుకుంటుంటారు కాబట్టి. 

అయితే.. తమిళంలో ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మహేష్‌కు ఒక్క కోరిక మాత్రం తీరలేదుట. మహేష్‌ ఈ చిత్రంలో తన పాత్రకు తనే తమిళ డబ్బింగ్‌ కూడా చెప్పుకోవాలని అనుకున్నారు. కానీ సమయం లేకపోవడం వల్ల అది కుదర్లేదు. వేరేవాళ్లతో డబ్బింగ్‌ చెప్పించారు. తమిళంలో నేను చెప్పేవాణ్నే, నాకు ఇంట్రెస్టు కూడా ఉంది. కానీ టైం చాల్లేదు అని మహేష్‌ బాధపడుతున్నారు. మొత్తానికి ఆయనకు ఆ కోరిక తీరేలా లేదు. 

మహేష్‌ పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే. ఇప్పటికీ తన ఫ్రెండ్స్‌ అంతా మదరాసులోనే ఉన్నారు అంటారాయన. ఇప్పుడు జనం అంతా ఆ నగరాన్ని చెన్నై అంటూంటో.. మహేష్‌ మాత్రం.. తన చిన్ననాటి అలవాటు ప్రకారం మదరాసు అంటూనే మాట్లాడుతారు. అంతగా తమిళ అనుబంధం ఉన్నా.. తన స్ట్రెయిట్‌ చిత్రానికి డబ్బింగ్‌చెప్పుకోవాలనే కోరిక మాత్రం తీరలేదన్నమాట.