సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా డిస్పరేట్ గా వున్నారు. అర్జెంట్ గా ప్రాజెక్టు ఎక్కించాలి. ఎవరు? ఎవరు? ఎవరు? సుకుమార్ ను వద్దనుకున్నారు. వంశీ పైడిపల్లి ని దూరం చేసారు. పరుశురామ్ ను అనుకుంటే, 14 రీల్స్-మైత్రీ మధ్య తకరారు తెగేలా లేదు. అందుకే ఈసారి మైత్రీ మూవీస్ మరో ప్లాన్ వేసినట్లు బోగట్టా.
వి సినిమా తరువాత డైరక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ మైత్రీ మూవీస్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. ఆ ట్రంప్ కార్డును ఇప్పుడు వాడాలని మైత్రీ ప్లాన్ చేస్తోంది. ముంబాయిలో వున్న మహేష్ ను కాంట్రాక్ట్ చేసి, అర్జంట్ గా ఇంద్రగంటి కోసం అపాయింట్ మెంట్ అడిగినట్లు బోగట్టా.
హైదరాబాద్ తిరిగి వచ్చాక 27 లేదా 28న కలుస్తా అని మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ బాగుండి, ఇంద్రగంటి పాయింట్ కనుక మహేష్ కు నచ్చితే ఏ గొడవా లేదు. పరుశురామ్ హాయిగా 14రీల్స్ ప్లస్ సినిమా చేసుకుంటారు. మైత్రీ సోలోగా మహేష్ సినిమా చేసుకుంటుంది. లేదూ అంటే కథ మళ్లీ మొదటికి వస్తుంది.