గత నాలుగైదు రోజులుగా వెబ్ వార్తల్లో నలుగుతున్న అంశం మహేష్-వంశీ పైడిపల్లి సినిమా. స్క్రిప్ట్ నచ్చక మహేష్ ఈ సినిమాను ఆపేసాడని వార్తలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచి ఇక ఎన్ని వార్తలు వచ్చాయో లెక్కలేదు. ఈ టోటల్ ఎపిసోడ్ లో బలయ్యింది వంశీ పైడిపల్లి. కానీ చాలా పశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోయాయి. వాటి అన్నంటికి సమాధానాలు వెదుకితే, అసలు కీలకమైన విషయం వేరే అంటూ ఓ కీలకమైన ట్విస్ట్ తెలుస్తోంది.
అసలు ఈ టోటల్ ఎపిసోడ్ ఎలా ప్రారంభమైంది?
మహేష్-వంశీ పైడిపల్లి సినిమా లేదంటూ మహేష్ కు సన్నిహితమైన ఓ ప్రొడక్షన్ హవుస్ నుంచి మీడియాకు లీకులు రావడం ద్వారా.
ఇక్కడ ఆన్సర్లు రావాల్సిన క్వశ్చన్లు ఏమిటంటే..
మహేష్ కు స్క్రిప్ఠ్ నచ్చకపోతే, మరింత టైమ్ ఇచ్చి చేయించుకోవచ్చు. ఎందుకంటే వంశీ పైడిపల్లి అంత టాలెంట్ లేని దర్శకుడు కాదు. పైగా నిర్మాత దిల్ రాజు. ఆయన అనుకుంటే చాలా మంది డైరక్టర్లు వస్తారు. స్క్రిప్ట్ లు ఆయన చేయించగలరు. అందువల్ల మహేష్ టోటల్ గా సినిమా ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? నిర్మాతను కూడా ఎందుకు మార్చేయాల్సి వచ్చింది.
ఏ దర్ళకుడు అయినా మహేష్ పిలిచి ఫలానా నిర్మాతకే చేస్తాను అంటే ఊ అనే అంటాడు తప్ప, ఆ నిర్మాతకు చేయను అని అనడు కదా? పైగా దిల్ రాజుకు చేయను అనే డైరక్టర్ ఎవ్వరూ లేరు కదా? మహర్షి సినిమా దిల్ రాజు లేకుంటే విడుదల కావడం కష్టం అయ్యేది. సరిలేరు సినిమాకు దిల్ రాజు కాకుంటే ఆ థియేటర్ల ప్లానింగ్ అంతలా వుండేది కాదు. అందువల్ల వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ కోసం దిల్ రాజను ఎందుకు వదులుకుంటారు. అంటే ఏదో వుంది అసలు సంగతి.
పైగా మహేష్ కు అర్జెంట్ గా సినిమా ఎక్కించే పని లేదు. ఈసమ్మర్ నుంచి వచ్చే సమ్మర్ వరకు టైమ్ వుంది. మహేష్ కుటుంబంతో అంతలా కలిసిపాయిన వంశీ పైడిపల్లి ఆ మాత్రం మార్పులు చేయలేరా?
బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు మహేష్ ఓకె చేసిన స్క్రిప్ఠ్ లే కదా? ఆఖరికి సరిలేరు నీకెవ్వరు కూడా ఆయన ఓకె చేసిన స్క్రిప్ట్ నే కదా? మరి అందులో ట్రయిన్ ఎపిసోడ్ ను ఇంకా ఎందుకు బెటర్ చేయించలేకపోయారు?
అంటే ఇక్కడ వంశీ పైడిపల్లి, స్క్రిప్ట్ అన్నది మాత్రమే సమస్య కాదు. ఇంకేదో వుంది. అదేంటీ అన్నది ఇండస్ట్రీలోని కీలక సర్కిళ్లలో మాత్రం వినిపిస్తోంది. ఏమిటంటే..
మహర్షి సినిమాకు నిర్మాతలకు లాభాలు రాలేదు. దిల్ రాజుకు అందుకే సరిలేరు నీకెవ్వరు సినిమా వైజాగ్, నైజాం హక్కులు డిస్కౌంట్ చేసి ఇచ్చారు. పివిపికి అయితే అదీ లేదు.
ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా పండగ టైమ్ లో మంచి ఊపు మీద ఆడేయడంతో నిర్మాత గట్టెక్కారు. లేదూ అంటే ఆ సినిమా బడ్జెట్ కు అనిల్ సుంకర కూడా ఇబ్బందిలో పడేవారు.
ఈ రెండు విషయాలు క్లోజ్ గా తెలిసిన వ్యక్తి దిల్ రాజు. అందుకే ఆయన వంశీ పైడిపల్లి సినిమాకు రెమ్యూనిరేషన్ కొంచెం తగ్గించకుంటే వర్కవుట్ కాదని ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రపోజల్ పెట్టేనాటికి ఇంకా స్క్రిప్ట్ వ్యవహారాలు లేవు. మహేష్ నాన్ థియేటర్ హక్కుల కింద 50 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా తగ్గించుకుంటారు? అలా అని ఎలా నో అని చెబుతారు.
అందుకే స్క్రిప్ట్ వినే కార్యక్రమం టేకప్ చేసారు. నచ్చలేదు. ప్రాజెక్ట్ క్యాన్సిల్. మరో నిర్మాత. మరో ప్రాజెక్టు. నాన్ థియేటర్ హక్కులు లేదా సమాన మొత్తం.
ఇదీ తెరవెనుక జరిగింది అన్నది ఇండస్ట్రీలో చాలా కీలక మైన వర్గాల్లో వినిపిస్తున్న సంగతి.