Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

"మా"లో ముసలం.. ఇదే అసలు కారణం!

"మా"లో మరోసారి వివాదం చెలరేగింది. మీటింగ్ పెట్టి మరీ కొట్టుకున్నారు. ఒకర్నొకరు తిట్టిపోసుకున్నారు. ఫృధ్వి లాంటి సభ్యులైతే దీన్నొక చెత్త మీటింగ్ గా కొట్టిపారేశారు. పరుచూరి లాంటి పెద్ద మనుషులు బాధపడుతూ వెళ్లిపోయారు. అయితే అసోసియేషన్ లో ఈ లొల్లి మళ్లీ ఎందుకు షురూ అయింది. అసలు "మా"లో ఏం జరుగుతోంది? కొంతమంది సభ్యులు ఏం కోరుకుంటున్నారు.

"మా" అసోసియేషన్ లో రాజశేఖర్ బృందానికి నరేష్ వర్గానికి పడడం లేదనేది బహిరంగ రహస్యం. అధ్యక్ష స్థానంలో ఉండి మీటింగ్స్ పెట్టాల్సిన నరేష్, సినిమా షూటింగ్స్ కు వెళ్తున్నారని, సంక్షేమం సంగతి మరిచిపోయారని రాజశేఖర్ వర్గం ఆరోపిస్తోంది. నరేష్ వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. అయితే ఇవన్నీ పైకి చెప్పుకునేవి మాత్రం అసలైన కారణాలు రెండు ఉన్నాయి. వీటిలో ఒకటి అధ్యక్ష స్థానం నుంచి నరేష్ ను తొలిగించడం, రెండోది ఐదున్నర కోట్ల కార్పస్ ఫండ్ విషయంలో నరేష్ ను కార్నర్ చేయడం.

నరేష్ మీటింగ్స్ కు రావడం లేదని, ఫండ్ రైజింగ్ చేయకుండా, ఉన్న డబ్బుల్ని ఎక్కువ ఖర్చు చేస్తున్నారని రాజశేఖర్ వర్గం వాదిస్తోంది. ఈ రెండు పాయింట్ల అజెండాతోనే ఏకంగా ఎక్స్ టార్డనరీ జనరల్ బాడీ సమావేశం పెట్టాలని నిర్ణయించింది రాజశేఖర్ వర్గం. అంటే.. దాదాపు వెయ్యి మంది సభ్యులందర్నీ సమావేశపరచి తీర్మానం చేయాలనేది వీళ్లు ఎత్తుగడ. అయితే నరేష్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు. పాతికేళ్ల "మా" చరిత్రలో ఎక్స్ టార్డనరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదని, ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

కేవలం ఫ్రెండ్లీ మీటింగ్ అని చెప్పిన తర్వాతే తను సినిమా షూటింగ్ కు వెళ్లానని, ముందు ఫ్రెండ్లీ మీటింగ్ అని చెప్పి తర్వాత దాన్ని అసోసియేషన్ మీటింగ్ గా మార్చారని నరేష్ ఆరోపిస్తున్నారు. కేవలం ప్రీ-ప్లాన్డ్ గానే ఈ మీటింగ్ పెట్టారనేది నరేష్ వాదన. పనిలోపనిగా ఎకౌంట్ లో డబ్బుపై కూడా నరేష్ స్పందించారు. ఆడిట్ మొత్తం క్లియర్ గా ఉందని, తాజాగా సభ్యులందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందించామని, కోటి 70లక్షల రూపాయలతో ఈవెంట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని నరేష్ అంటున్నారు.

కేవలం అభిప్రాయబేధాలు తొలిగించుకునేందుకే మీటింగ్ పెట్టామని ఓవైపు జనరల్ సెక్రటరీ చెప్పడంతో ఆంతర్యం.. తను ఎప్పుడూ సభ్యులకు అందుబాటులోనే ఉంటానంటూ నరేష్ పదేపదే చెప్పుకోవడం వెనక కారణం ఒకటే. అధ్యక్ష పదవి నుంచి నరేష్ ను తప్పించాలని రాజశేఖర్ వర్గం భావించడంతోనే సమస్య అంతా వస్తోంది.

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?