Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'మజిలీ'లో ఇద్దరు హీరోయిన్లు?

'మజిలీ'లో ఇద్దరు హీరోయిన్లు?

మేకింగ్ లో వున్న నాగచైతన్య మూవీ 'మజిలీ'. పెళ్లయిన తరువాత సమంత-నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇది. శివనిర్వాణ దర్శకుడు. ఈ సినిమా మీదే నాగచైతన్య ఆశలన్నీ. లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా వుంటుందని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర నిడివి పూర్తిగా వుండకపోవచ్చు అని, కానీ కీలకమైన పాత్ర అనీ తెలుస్తోంది.

అందువల్ల ఈ పాత్రకు ఎవర్ని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమంత మెయిన్ లీడ్ కాబట్టి, మరో హీరోయిన్ గా ఎవర్ని తీసుకున్నా, మరీ టాప్ హీరోయిన్ ను తీసుకోరని, యావరేజ్ హీరోయిన్ నే తీసుకుంటారని టాక్ వుంది. 

ఇదిలావుంటే మజిలీ సినిమా కథపై కూడా గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత వ్యవహారాలపై కథ నడుస్తుందని గతంలోనే వినిపించింది. ఈ సినిమాలో తనకు సమంతకు బోలెడు గొడవలు వుంటాయని ఇటీవలే నాగచైతన్య చెప్పాడు.

తాజాగా వినిపిస్తున్న దాని ప్రకారం గతంలో వచ్చిన రాజారాణి టైపు కథతో ఈ సినిమా వుంటుదని తెలుస్తోంది. చాలా హెవీ ఎమోషనల్ క్యారెక్టర్ ను నాగచైతన్య చేస్తున్నాడట ఈ సినిమాలో. అదీ సంగతి.

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?