Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మీ టూః అర్జున్ ఇన్ డీప్ ట్రబుల్?!

మీ టూః అర్జున్ ఇన్ డీప్ ట్రబుల్?!

మీటూ వ్యవహారంలో చాలామంది సినిమా నటుల పేర్లు వినిపించాయి. ప్రముఖుల మీద ఆరోపణలు వచ్చాయి. వారంతా ఈ విషయంలో ఎదురుదాడి చేశారు. తమపై ఆరోపణలు చేసిన వాళ్లపై కేసులు, పరువు నష్టం దావాలతో వాళ్లు చెలరేగిపోయారు. ఈ వ్యవహారంలో బాగా నష్టపోయింది కేవంలం ఎంజే అక్బర్ మాత్రమే. కేంద్రమంత్రి పదవిని కోల్పోయాడాయన.

ఇక ఆ తర్వాత మీటూ తుఫాన్ లో బాగా ఇబ్బంది పడుతున్నది దక్షిణాది యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రమే. మీటూ ఉద్యమంలో భాగంగా చాలామంది మేల్ సెలబ్రిటీలు వివాదాన్ని ఎదుర్కొన్నా.. పోలిస్ స్టేషన్ వరకూ వెళ్లింది మాత్రం అర్జున్ మాత్రమే. పోలీసుల విచారణను ఎదుర్కొన్నాడు ఇతడు.

అర్జున్ మీద ఆరోపణలు చేసింది శ్రుతి హరిహరన్. ఆమె చేసిన ఆరోపణలు మొదట్లో తేలికగా కనిపించినా.. స్టేషన్ వరకూ వెళ్లేసరికి చాలా తీవ్రం అయ్యాయి. ఈ వ్యవహారంలో అర్జున్ కూడా ఎదురుదాడి చేశాడు. ఆమెపై పరువు నష్టం దావాను వేశాడు. అయితే అది అర్జున్ ను సేఫ్ జోన్లోకి తీసుకురాలేకపోయింది.

కబ్బన్ పార్క్ పోలిస్ స్టేషన్లో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు అర్జున్ విచారణకు హాజరయ్యాడు. ఈ విచారణతో తెలుస్తున్నది ఏమిటంటే.. అర్జున్ మీద శ్రుతి తీవ్రమైన ఆరోపణలే చేసిందని. అర్జున్ కేవలం సినిమా షూటింగ్ స్పాట్ లోనే కాకుండా.. ఆ షూటింగ్ జరిగినన్ని రోజులూ తనను వేధించాడని.. తనను బెడ్రూమ్ కు రమ్మని తీవ్రమైన ఒత్తిడి చేశాడని శ్రుతి ఫిర్యాదులో పేర్కొంది.

మొదటేమో ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ సందర్భంగా మాత్రమే అర్జున్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని వార్తలు రాగా.. పోలిస్ స్టేషన్లో దాఖలైన ఫిర్యాదులో మాత్రం శ్రుతి చాలా ఆరోపణలు చేసిందని తెలుస్తోంది.

ఒకసారి కాదు.. చాలాసార్లు అర్జున్ తనమీద ఒత్తిడి తీసుకువచ్చాడని.. తనను కౌగిలించుకున్నాడని, రూమ్ కు రమ్మన్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని.. షూటింగ్ జరిగినన్ని రోజులూ ఈ తతంగం రిపీట్ అయ్యిందిన శ్రుతి స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ అంశం గురించి అర్జున్ వద్ద ఆరా తీశారట పోలీసులు. అయితే అర్జున్ అవన్నీ అబద్ధాలే అని చెప్పాడట. ఆమె నిరాధార ఆరోపణలు చేసిందని పోలీసులకు సమాధానం ఇచ్చాడు యాక్షన్ కింగ్. ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. అర్జున్, శ్రుతిహరిహరన్ ల మధ్యన వివాదాన్ని సెటిల్ చేయడానికి కన్నడ చిత్రరంగ ప్రముఖులు ప్రయత్నించారు.

కన్నడ స్టార్ హీరో రెబల్ స్టార్ అంబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పంచాయితీ చేశాడట. అయినా శ్రుతి ఫిర్యాదును వెనక్కు తీసుకోవడానికి నో చెప్పిందని సమాచారం!

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?