Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టీజర్ కూడా మారుస్తారా? బోయపాటీ?

టీజర్ కూడా మారుస్తారా? బోయపాటీ?

రామ్ చరణ్ వైట్ అండ్ వైట్ పంచెకట్టు అన్నది ఫస్ట్ లుక్ గా వస్తోందని మీడియాలో ముందే లీక్ అయిపోయింది. దాంతో లాస్ట్ మినిట్ లో వేరే స్టిల్ ను వదలడానికి కిందామీదా అయ్యారు దర్శకుడు బోయపాటి. ఆ లుక్ అంతగా ఆకట్టుకోలేదు. అది వేరే సంగతి.

మరో రెండురోజుల్లో టీజర్ రాబోతోంది. సినిమాలోని రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్ లను కలిపి, ఓ యాక్షన్ టీజర్ గా కట్ చేసారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. టీజర్ పూర్తిగా వీరమాస్ యాక్షన్ బోయపాటి ఊచకోత టైపులోనే వుంటుదట. టీజర్ చివర్న రెండు డైలాగులు వుంటాయి.

టీజర్ చూడగానే ఆ టీజర్ మీద అరవింద సమేత వీరరాఘవ టీజర్ ప్రభావం వున్నట్లు అనిపిస్తుందని తెలుస్తోంది. బట్ ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. టీజర్ మాత్రం అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుందని, అదిరిపోయిందిగా... అని అనిపిస్తుందని తెలుస్తోంది.

అంతా బాగానే వుంది. మరి టీజర్ డిటెల్స్ కూడా బయటకు తెలుస్తున్నాయి కదా? కొంపదీసి లాస్ట్ మినిట్ లో టీజర్ కట్ కూడా మారుస్తారా?

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?