జనవరిలో మిస్టర్ మజ్ఞు

అక్కినేని అఖిల్ కూడా జనవరి బరిలోకి దిగుతున్నాడు. అతగాడి లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ఞు విడుదల జనవరిలో అంటూ ప్రకటించబోతున్నారు. ఈ సినిమాను డిసెంబర్ అనుకున్నారు. కానీ సరైన స్లాట్ దొరక్క ఫిబ్రవరికి వెళ్దాం…

అక్కినేని అఖిల్ కూడా జనవరి బరిలోకి దిగుతున్నాడు. అతగాడి లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ఞు విడుదల జనవరిలో అంటూ ప్రకటించబోతున్నారు. ఈ సినిమాను డిసెంబర్ అనుకున్నారు. కానీ సరైన స్లాట్ దొరక్క ఫిబ్రవరికి వెళ్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 8కి వాయిదా వెళుతోందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. 

అందువల్ల జనవరి 25 అవకాశం వాడుకోవాలని మిస్టర్ మజ్ఞు టీమ్ భావిస్తోంది. అందుకే ముందుగా రుమాలు వేసేయాలని డేట్ చెప్పకుండా, జనవరి 2019 విడుదల అంటూ దీపావళి శుభాకాంక్షలు అందించబోతోంది.

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 వెనక్కు వెళ్లడం ఖరారు అవ్వాలే కానీ, జనవరి 25న రావడానికి ఇంకా చాలా సినిమాలు చూస్తున్నాయి. కార్తీక్ దేవ్, నిఖిల్ ముద్ర, ఇంకా అనేక సినిమాలు డేట్ విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాయి.

అప్పుడు అఖిల్ సినిమాకు కాస్త గట్టిపోటీ వుంటుందేమో? అఖిల్ మిస్టర్ మజ్ఞుకు వెంకీ అట్లూరి దర్శకుడు.

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్