రెండు పీఆర్ టీమ్ లతో తకరారు

లాస్ట్ మినిట్ లో పంచెకట్టు లుక్ వదిలి, తన స్టయిల్ మాస్ లుక్ వదలాలని, హడావుడిగా ఓ స్టిల్ రెడీ చేయించి వదిలారు దర్శకుడు బోయపాటి. వినయ విధేయరామ సినిమా పబ్లిసిటీ విషయంలో ఆయన…

లాస్ట్ మినిట్ లో పంచెకట్టు లుక్ వదిలి, తన స్టయిల్ మాస్ లుక్ వదలాలని, హడావుడిగా ఓ స్టిల్ రెడీ చేయించి వదిలారు దర్శకుడు బోయపాటి. వినయ విధేయరామ సినిమా పబ్లిసిటీ విషయంలో ఆయన మొదటి నుంచీ కాస్త భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారని వదంతులు వున్నాయి.

ఆయన స్వంత పీఆర్ టీమ్ ను కాదని, తను ఎంతచెప్పినా వినకుండా, రామ్ చరణ్ తన పీఆర్ టీమ్ నే వుంచారని, బోయపాటికి లోపల కాస్త కినుక వుందని ఇండస్ట్రీలో టాక్ వుంది. బోయపాటి సినిమాను చేస్తున్న వ్యవహారాలపై కథనాలు రావడం, దానికి బోయపాటి తన పీఆర్ టీమ్ ప్రభావంతో కౌంటర్లు రావడం మామూలైపోయింది.

ఇలాంటి టైమ్ లో ఫస్ట్ లుక్ ఇక ఇవ్వక తప్పని టైమ్ వచ్చింది. చరణ్ పంచెకట్టు లుక్ రెడీ చేసారు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా పడి బయటకు వచ్చింది. దాంతో లాస్ట్ మినిట్ లో మార్చేసి, వేరే స్టిల్ చేయించారు. ఈసారి సినిమా పీఆర్ టీమ్ ను కూడా లాస్ట్ మినిట్ వరకు దూరం వుంచారు.

అంతా బాగానే వుంది. కానీ ఆ స్టిల్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చిరుత, బ్రూస్ లీ తదితర సినిమాల్లో ఇదే మాదిరిగా చరణ్ పరుగెడుతున్న స్టిల్స్ చలామణీ చేస్తూ, కొత్త ఏముంది అనేట్లు హడావుడి చేస్తున్నారు.

జయజానకీ నాయకలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ ఇలాగే పరిగెట్టుకువస్తున్న స్టిల్ ను గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద లుక్ లీక్ ఇన్ని తంటాలు తెచ్చిపెట్టింది.

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్