Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'యాత్ర' ముందుకు.. వెనక్కు?

'యాత్ర' ముందుకు.. వెనక్కు?

వైఎస్ బయోపిక్ షూట్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 21 విడుదల అని ఎప్పుడో ప్రకటించారు. అందువల్ల ఇంకా బోలెడు దూరం వుంది. సో, వర్క్ ప్రెషర్ అయితే లేదు. కానీ అనుకున్నట్లు డిసెంబర్ 21న విడుదల వుంటుందా? వుండదా? అన్న అనుమానాలు మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

వాస్తవానికి యాత్ర సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. సినిమా నిర్మాణం, స్టార్ట్ చేసినపుడు అదే అన్నారు. కానీ తరువాత మనసు మార్చుకుని, డిసెంబర్ 21 అని ప్రకటించారు. కానీ లేటెస్ట్ గా మళ్లీ ఒరిజినల్ డేట్ కే వెళ్లాలని ఆలోచిస్తున్నారని వినిపిస్తోంది.

డిసెంబర్ 21న పోటీ ఎక్కవగా వుందనో? సంక్రాంతి సీజన్ అయితే ఎన్ని సినిమాలు అయినా ఫరవాలేదనో? మొత్తానికి ఏవో డిస్కషన్లు మాత్రం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి వైఎస్ గా, జగపతి బాబు రాజారెడ్డిగా కనిపించే యాత్ర సినిమాను 70ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?