Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొంచెం కట్ చేశారు.. అయినా లెంగ్త్ ఎక్కువే

కొంచెం కట్ చేశారు.. అయినా లెంగ్త్ ఎక్కువే

సాహో సినిమా ఎడిట్ వెర్షన్ లో 2 గంటల 52 నిమిషాలు వచ్చింది. నో స్మోకింగ్ యాడ్స్ కూడా కలుపుకుంటే నిడివి 3 గంటలు దాటిపోతుంది. ఇంత భారీ రన్ టైమ్ తో సినిమాను రిలీజ్ చేస్తే కష్టమని, రన్ టైమ్ కాస్త తగ్గించాలని యూనిట్ భావించింది. ఈ మేరకు కాస్త ట్రిమ్ చేసింది. అయినప్పటికీ రన్ టైమ్ ఇంకా ఎక్కువనే చెప్పాలి.

తాజాగా సినిమాకు సంబంధించి మరో 6 నిమిషాల రన్ టైమ్ తగ్గించారు. దీంతో ప్రస్తుత నిడివి 2 గంటల 46 నిమిషాలకు వచ్చింది. ఇదే రన్ టైమ్ తో సినిమాను సెన్సార్ కు పంపించే ఆలోచనలో ఉన్నారు. అంటే.. దాదాపు ఇదే డ్యూరేషన్ ను ఫిక్స్ చేయబోతున్నారన్నమాట. గతంలో రంగస్థలం, మహర్షి లాంటి సినిమాలు దాదాపు ఇదే నిడివితో వచ్చాయి. ఇంకా చెప్పాలంటే సాహో కంటే ఈ రెండు సినిమాల రన్ టైమ్ కాస్త ఎక్కువే.

మహర్షి సినిమా 2 గంటల 48 నిమిషాల నిడివి ఉంటే, రంగస్థలం దాదాపు 3 గంటలుంది. అటు మహానటి కూడా 2 గంటల 56 నిమిషాలుంది. సో.. సాహో సినిమాకు 2 గంటల 46 నిమిషాల రన్ టైమ్ ను దాదాపు లాక్ చేసినట్టే. బాహుబలి-2 డ్యూరేషన్ కూడా కాస్త ఎక్కువే. కానీ అందులో ఎండ్ టైటిల్స్, క్రెడిట్ స్లైడ్స్ ఎక్కువ టైమ్ తినేశాయి. అలా చూసుకుంటే సినిమా నిడివి తక్కువే.

మరోవైపు మిగతా భాషలకు సంబంధించి ఇదే రన్ టైమ్ ఉంచాలా వద్దా అనే అంశంపై కూడా చిన్నపాటి చర్చ సాగుతోంది. సాహో సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో కాస్త తక్కువ నిడివితో రిలీజ్ చేయమని మేకర్స్ కు కొందరు సలహా ఇచ్చారట. కానీ ఆఖరి నిమిషంలో ఇలాంటి తలనొప్పులు ఎందుకని యూనిట్ భావిస్తోంది.

రణరంగం సినిమాపై ప్రేక్షకులు ఏమన్నారంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?