ఇప్పటికే చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న అర్భాజ్ ఖాన్- మలైక అరోరాల విడాకుల వ్యవహారం బాంద్రా కోర్టు వరకూ చేరుకుంది. కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్న ఈ దంపతులు విడాకులకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా దాఖలైన వీరి విడాకుల పిటిషనే అందుకు రుజువు.
మలైకా- అర్బాజ్ లు దాదాపు దశాబ్దం పైనే దాంపత్య జీవనాన్ని సాగించారు. పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. కొన్నాళ్ల కిందట వీరు విడిపోయారు.
అయితే.. వీరిని తిరిగి కలపడానికి సల్మాన్ ఫ్యామిలీ తీవ్రంగానే ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని సమాచారం. ఒకవైపు ఈ జంట వేర్వేరుగా ఉండగానే.. వీరిద్దరి మధ్యన అర్జున్ కపూర్ ప్రవేశించాడనే వార్తా వినిపించింది.
ఇటీవల అర్ధరాత్రి పూట మలైక ఇంటి నుంచి అర్జున్ కపూర్ బయటకు వచ్చి మీడియా కంట బడటం.. అనేక అనుమాన పూర్వకమైన కథనాలకు కారణమైంది. దీంతో రాజీ ప్రయత్నాలు పూర్తిగాబెడిసి కొట్టాయి.
రాజీ అవుతున్నారేమో అనిపించిన దశలో అర్జున్ కపూర్ వ్యవహారంతో.. తిరిగి ఈ దంపతుల మధ్య దూరాన్ని పెంచిందనే మాట వినిపిస్తోంది. ఇన్ని రోజులూ విడాకుల పిటిషన్ లేదు.. ఇప్పుడు ఆ లాంఛనం కూడా జరిగినట్టే కాబట్టి.. బాలీవుడ్ లో వీరిది మరో వేరుపడ్డ జంటగా నిలుస్తున్నట్టే