తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక గట్టి ప్రచారం జరుగుతోంది. నయనతారకు ఆమె ప్రియుడు విఘ్నేష్ కు వివాహం జరిగిపోయిందనేది ఈ ప్రచారం సారాంశం. కొన్ని రోజుల కిందట వీళ్లు పెళ్లి చేసుకుని దంపతులు అయిపోయారని, అయితే ఈ విషయాన్ని దాస్తూ వీళ్లు మేనేజ్ చేస్తున్నారని తమిళ సినీ జనాలు చెవులు కొరుక్కొంటున్నారు.
కొన్ని నెలల నుంచి నయన-విఘ్నేష్ ల ప్రేమాయణం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ చాలా క్లోజ్ ఉంటూ దిగిన సెల్ఫీలు, కలిసి ఓనం పండుగను జరపుకోవడంతో పాటు.. విఘ్నేష్ దర్శకుడిగా నిలదొక్కుకునేందుకు నయన చాలా సహకారం అందిస్తోందనే వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం విఘ్నేష్ కు సూర్యతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశం కూడా నయనతార ఇప్పించిందే. ఇండస్ట్రీలో తన పరపతిని ఉపయోగించుకుని ఆమె విఘ్నేష్ కు దర్శకత్వం అవకాశం ఇప్పించిందంటారు. ఇక నయనతారకు గత ప్రేమానుభవాలున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆమె ఇతడితో సైలెంట్ గా వివాహాన్ని చేసుకుందంటున్నారు.
శింబుతో ప్రేమాయణం, ప్రభుదేవాతో పెళ్లి వరకూ వచ్చి ఆగిన ప్రేమాయణాల నేపథ్యంలో పెద్దగా హడావుడి లేకుండా విఘ్నేష్ ను ఈమె వివాహం చేసుకుందని .. కొంత కాలం తర్వాత వీరు తమ వివాహ వార్తను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది!