సిద్ శ్రీరామ్-గోపీసుందర్ కాంబినేషన్ అనగానే గీత గోవిందం గీతాలు గుర్తు వస్తాయి. అప్పటి నుంచే బాగా ఎక్కువగా సిద్ శ్రీరామ్ మ్యాజిక్ ప్రారంభమైంది. అల వైకుంఠపురములో సినిమాతో పీక్స్ కు వెళ్లింది. మళ్లీ ఇప్పుడు గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో బన్నీవాస్ నిర్మాతగా జిఎ2 నిర్మించే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచురల్ సినిమాకు గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాటను ముందుగా బయటకు వదుల్తున్నారు. మార్చి 2న సిద్ శ్రీరామ్ పాడిన మనసా..మనసా అనే పాటను విడుదల చేస్తున్నారు.
అఖిల్ సరసన లక్కీ లేడీ పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాకు వాసు వర్మ స్క్రిప్ట్ సహకారం అందించారు. దాదాపు సగానికి పైగా పూర్తయిన ఈ సినిమాను ఏప్రియల్ 14న విడుదల చేయాలని ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు.