రెండు మంచి హిట్ సినిమాలు ఇచ్చినా కూడా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అయిపోయింది. దర్శకుడు నక్కిన త్రినాధరావుకు. అతని జోడీ బెజవాడ ప్రసన్నకు.. ఎక్కడా సినిమా సెట్ కాలేదు. ఆఖరికి ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. చేతిలో బోలెడు ప్రాజెక్టుల వరుసగా పెట్టుకున్న పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల దీనికి నిర్మాతలు. హీరో ఎవరో కాదు. మాస్ మహరాజా రవితేజ.
ప్రస్తుతం టాగోర్ మధు నిర్మాత రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నారు. అది పూర్తి కాగానే ఇది ప్రారంభమవుతుంది. ఇధి కాక రవితేజ మరో సినిమా కూడా ఇప్పటికే ప్రకటించి వున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా, రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా అని ప్రకటించారు. మరి అది ముందు చేస్తారో? ఇది ముందు చేస్తారో చూడాలి.
వాస్తవానికి రవితేజకు నక్కిన త్రినాధరావు దే మంచి ప్రాజెక్టు అవుతుంది. రమేష్ వర్మ ఫామ్ లో లేరు. ఆ మధ్య ఓ రీమేక్ థ్రిల్లర్ మాత్రమే చేసారు. కానీ నక్కిన రెండు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో హిట్ ట్రాక్ లో వున్నారు.