క్రిష్..టాలీవుడ్ లోని కాస్త విషయం వున్న డైరక్టర్లలో ఒకడు. వైవిధ్యమైన సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు. అలా అని చేసిన హీరోలతో ఇంతవరకు చేయలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ తో మళ్లీ మరోసారి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతుంది. కంచె సినిమా వరుణ్ తేజ ను నటుడిగా ఓ మెట్టు ఎక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత క్రిష్ ముంబాయి వెళ్లిపోయాడు. ఈరోస్ తో ఒప్పందం ప్రకారం అక్కడ సినిమా చేయాల్సి వుంది.
అయితే ఇప్పుడు ఈరోస్ సంస్థ కాస్త ఒడిదుడుకుల్లో వుంది. బహుశా అందువల్ల వెంటనే సినిమా ప్రారంభం కాకపోవచ్చు.అందుకే మళ్లీ తెలుగులో ‘రాయబారి’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. అది వరుణ్ తేజ కోసమే అని వినికిడి. క్రిష్ దగ్గర మాంచి ప్రేమ కథ వుందని, అదే ఇప్పుడు వరుణ్ తేజతో తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ లోఫర్ సినిమాను పూరి డైరక్షన్ లో చేస్తున్నాడు. అది దాదాపు పూర్తి కావచ్చింది. దాని తరువాత ఈ సినిమా వుంటుంది.