Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పీవీపీకి ఫైనాన్స్ కావాలా?

పీవీపీకి ఫైనాన్స్ కావాలా?

పివిపి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అతి పెద్ద ఫైనాన్షియర్లలో ఒకరు. అనేకనేక వ్యాపారాలు. భారీ ప్రాజెక్టులు. ప్రతి పెద్ద సినిమా వెనుక పివిపి ఫైనాన్స్ వుంటుంది. అలాంటిది ఇప్పుడు ఆయన కూడా ఫైనాన్సు కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చాలా ప్రాజెక్టుల ఒకేసారి ప్రారంభించారు. 

పైగా అనేక సినిమాలకు ఫైనాన్స్ చేసి, ఫండ్స్ ఇరుక్కుపోయాయని వినికిడి. దాంతో ఆయన తన స్వంత సినిమా బ్రహ్మోత్సవం కోసం పాతిక కోట్లు పైగానే ఫైనాన్స్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందుకోసం ఆయన సినిమా ల్యాబ్ పేపర్స్ ను హామీగా పెట్టి, వెంకటరామిరెడ్డి అనే ఫైనాన్సియర్ దగ్గర పాతిక కోట్లు అప్పు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టర్నోవర్ మీద నడిచే ఇండస్ట్రీ టాలీవుడ్ అంటే. అందువల్ల ఎంతవారికైనా అప్పు తప్పదు కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?