మంచు లక్ష్మి టీవీ షో ప్రెజెంటర్ గా కొన్నాళ్ల పాటు అందర్నీ అలరించింది. తనకున్న పరిచయాలతో ప్రముఖులు అందరినీ టీవీ స్టూడియోలకు రప్పించి, కాస్త పర్సనల్ క్వశ్చన్లు కూడా అడిగి, జనాలకు ఆసక్తి కలిగించింది.
'ప్రేమతో మీ లక్ష్మీ' అంటూ నడిచిన టాక్ షో హిట్ అయినా, తరువాత నటిగా బిజీ కావడంతో మరి కొనసాగించలేదు. ఇప్పుడు కూడా మంచు లక్ష్మి నటిగా, తల్లిగా, నిర్మాతగా, అన్ని విదాల బిజీ బిజీ. అయినా మళ్లీ మరో టాక్ షో చేయాలనుకుంటోందట.
దానికి మళ్లీ మళ్లీ ఇది రాని రాని రోజు అని టైటిల్ కూడా ఫిక్స్ చేసిందట. జీ తెలుగులో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం కోసం మరి ఎవరు వస్తారో, ఏ సందడి చేస్తారో చూడాల్సి వుంది.