కోలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రస్తుతం రౌండ్స్ కొడుతోంది. నాగచైతన్య హీరోయిన్ మంజిమా మోహన్, మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ కు వరసకు బ్రదర్ అయ్యే రిషికేష్ ప్రేమించుకుంటున్నారట. ఈ ఇద్దరూ తరచుగా కలుసుకుంటున్నారని, ఈవెనింగ్ పార్టీస్ కు రెగ్యులర్ గా ఎటెండ్ అవుతున్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది.
నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో సినిమా చేసింది మంజిమా మోహన్. ప్రస్తుతం కోలీవుడ్ లో ఉదయనిథి స్టాలిన్ సినిమాలో గ్లామర్ రోల్ లో కనిపిస్తోంది. కోలీవుడ్ లో పరిచయాలు పెంచుకుంటున్న టైమ్ లోనే అనిరుధ్ సోదరుడు రిషికేష్ తో మంజిమకు పరిచయమైందట. అప్పట్నుంచి వీళ్లిద్దరూ క్లోజ్ గా ఉంటున్నారని టాక్.
ఇంతకీ ఈ రిషికేష్ ఎవరో తెలుసా.. రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ కు తమ్ముడిగా నటించిన నటుడే ఈ రిషికేష్. ప్రస్తుతం ఈ కుర్రహీరో సోలోగా 2 సినిమాలు చేస్తున్నాడు. ఇలా కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రేమలో పడ్డారు మంజిమా, రిషికేష్.
సంగీత దర్శకుడు అనిరుధ్ ఎంత రసికుడో అందరికీ తెలిసిందే. సుచిలీక్స్ లో ఎక్కువ ఫొటోలు అనిరుధ్ వే ఉన్నాయంటే మనోడి మన్మధ లీలలు అర్థం చేసుకోవచ్చు. అలాంటి అనిరుధ్ బ్రదర్ రిషికేష్ ఇప్పుడు మంజిమతో డేటింగ్ చేస్తున్నాడు. మరి వీళ్ల ప్రేమకథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.