Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరీ అన్ని పాటలా వంశీ?

మరీ అన్ని పాటలా వంశీ?

ఆరు పాటల సినిమా అన్నది రేర్ అయిపోయింది. అయిదుపాటలే ఎక్కువగా ఒక సినిమాకు వినిపిస్తున్నాయి. ఎక్కడో కథ డిమాండ్ చేస్తే తప్ప ఆరో పాట వినిపించడం లేదు. అలాంటిది మహేష్ మహర్షిలో ఎనిమిది పాటలు వుంటాయట. ఆరు స్ట్రయిట్ సాంగ్స్, రెండు బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ మాదిరిగా వినిపించే సాంగ్స్ అంట.

దేవీశ్రీ ప్రసాద్ మరీ పెద్ద సినిమాలకు తప్ప సరైన మ్యూజిక్ ఇవ్వడం లేదనే అభిప్రాయం ఇటీవల బాగా వినిపిస్తోంది. పాత ట్యూన్ లే అటు ఇటు చేసి, క్యాచీగా మార్చేస్తున్నారని టాక్. కానీ పెద్ద సినిమాలకు అలా చేయడంలేదు. మహర్షి కి కూడా మంచి ట్యూన్ లే ఇచ్చారని వినిపిస్తోంది. జ్యూక్ బాక్స్ మొత్తం బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది.

ఇటీవల వదిలిన పాట బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ మాదిరిగా వచ్చే పాటేనంట. ఇప్పటికి వదిలినవి కాక, మరో అయిదు స్ట్రయిట్ సాంగ్స్, ఒక బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ సాంగ్ వుంటుందట. ఆరు స్ట్రయిట్ పాటలు అంటే అక్కడికే దాదాపు అరగంట సినిమా అయిపోతుంది.

మహర్షి సినిమా నిడివి దాదాపు మూడు గంటలు వుంటుదని వినిపిస్తోంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. 

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?