సమ్మర్ కలిసి వస్తోంది

మజిలీ, చిత్రలహరి సినిమాల కలెక్షన్లు బాగున్నాయి. సమ్మర్ హాలీడెస్ ప్రభావం, ఎన్నికలు ముగియడం కలిసివస్తున్నట్లు కనిపిస్తోంది. రెండోవారం అయినా మజిలీ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేస్తోంది. ఇప్పటికే మజిలీ బయ్యర్లు దాదాపు బ్రేక్…

మజిలీ, చిత్రలహరి సినిమాల కలెక్షన్లు బాగున్నాయి. సమ్మర్ హాలీడెస్ ప్రభావం, ఎన్నికలు ముగియడం కలిసివస్తున్నట్లు కనిపిస్తోంది. రెండోవారం అయినా మజిలీ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేస్తోంది. ఇప్పటికే మజిలీ బయ్యర్లు దాదాపు బ్రేక్ ఈవెన్ దశను దాటి కమిషన్ లు రాబట్టుకునే ప్రయత్నంలోకి వచ్చారు.

ఇదిలా వుంటే తొలిరోజు ఫిక్స్ డ్ హయ్యర్లతో కలిపి మూడుకోట్ల వరకు షేర్ సాధించిన చిత్రలహరి, రెండోరోజు కూడా పరవాలేదు, స్టడీగానే వున్నాయి అనే రేంజ్ లో కలెక్షన్లు తెచ్చుకుంది. ఈసారి మైత్రీమూవీస్ తన స్ట్రాటజీ మార్చుకుని,  బయ్యర్లకు చాలా రీజనబుల్ రేటులో సినిమాను ఇచ్చింది. ఆంధ్ర జస్ట్ ఆరుకోట్ల రేషియోలో ఇచ్చారు.

ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిపి పదిన్నర కోట్లకు ఇచ్చారు. తెలుగురాష్ట్రాల్లో ఇప్పటికే అయిదున్నర కోట్ల వరకు వసూళ్లు కనిపిస్తున్నాయి. సండేతో కలిపితే, ఏడుకోట్లకు చేరుకునే అవకాశం వుంది. అంటే ఫస్ట్ వీకెండ్ మూడు వంతులు లాగేసినట్లే.

19 వరకు అంటే ఇంకా నాలుగు రోజులు వుంది. అందువల్ల ఫస్ట్ వీక్ లో దాదాపు దగ్గర దగ్గరగా బ్రేక్ ఈవెన్ దశకు చిత్రలహరి చేరుకుంటుందని బయ్యర్లు ఆశగా వున్నారు. ఆ తరువాత మాత్రం జెర్సీ, కాంచన, ఆలాగే మరోవారం అయితే సీత, అవెంజర్స్ తో కలిసి కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి వుంటుంది.

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!