Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరింత ముదిరిన మహష్ సినిమా వివాదం?

మరింత ముదిరిన మహష్ సినిమా వివాదం?

మహష్-వంశీ పైడిపల్లి సినిమా వివాదం మరింత ముందిరినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాపై నిర్మాత పివిపి, స్టే తెచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాకు వర్క్ చేస్తున్న 14 మంది టెక్నీషియన్లకు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ మహేష్ బాబు అస్సలు ఏమీ తెలియనట్లు, అసలు వివాదమే లేనట్లూ, అమాయకంగా, అవునా? వివాదం వుందా? 14మంది నోటీసులు ఇచ్చారా? మీకు తెలుసా అని మీడియా సాక్షిగా ఎదురు ప్రశ్నించారు.

నోటీసులు అందుకున్న ఆ పధ్నాలుగు మందిలో ఆయన కూడా వున్నారన్న సంగతి నోటీసు అందుకున్న ఆయనకు తెలిసినా, దాచారు. ఈ కేసు జూన్ 4న , 11న, 18న వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ వాయిదా డేట్ లకే డెహ్రాడూన్ లో షూట్ ప్లాన్ చేస్తూ వచ్చారు. 

ఆఖరికి 18న అంటే ఈ రోజు స్టే వెకేట్ పిటిషన్ పై ఫైనల్ హియరింగ్ వుందని తెలిసి, అదే రోజు డెహ్రాడూన్ లో షూట్ స్టార్ట్ చేసారు. ఇదే సమస్యగా మారింది ఇప్పుడు.

పివిపి తరపు న్యాయవాది, స్టే వెకేట్ పిటిషన్ మీద హియరింగ్ కన్నా, స్టే వుండగా హీరో మహేష్ బాబు డెహ్రడూన్ లో షూటింగ్ ఎలా చేస్తారని, ఇది కోర్టు ధిక్కారణ కాదా? అని న్యాయమూర్తికి విన్నవించినట్లు తెలిసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, న్యాయమూర్తి ఈ విషయం మీద మరో రెండురోజుల్లో అంటే గురువారం నాడు ఇరు వర్గాలను అఫిడవిట్ లు దాఖలు చేయమని కోరినట్లు తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వులు దిక్కరించారా? లేదా? అన్నదానిపై ఇరు వర్గాలు ఎవరి పిటిషన్ వారు వేయాల్సి వుంటుంది.

ఇదిలా వుంటే అదే రోజు పివిపి తరపున న్యాయవాది మహేష్ తో సహా 14 మందిపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి దిల్ రాజు తరపు న్యాయవాది, అలాగే మహేష్ తరపు న్యాయవాది ఏం చేస్తారో చూడాలి.  కోర్టులో పివిపి సబ్ మిట్ చేసిన స్క్రిప్ట్ కాకుండా వేరే స్క్రిప్ట్ తో షూటింగ్ అయితే సమస్య లేదు. అయితే అలా అని దిల్ రాజు తరపున అఫడవిట్ దాఖలు కావాల్సి వుంటుంది.

చిటికలో పోయేదానికి

నిజానికి ఈ వివాదం సమసిపోయేదే. నెల రోజుల క్రితం దిల్ రాజు,అశ్వనీదత్ వేరు వేరుగా పివిపిని కలిసి, ఈ ప్రాజెక్టులో ఆయనను కూడా భాగస్వాములను చేస్తామని ఆఫర్ ఇచ్చారని వినికిడి. దానికి పివిపి కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఇద్దరు నిర్మాతలు వుంటే ముగ్గురు అవుతారన్నమాట. సినిమా లాభాల్లో సగం మహేష్ కు ఇవ్వగా మిగిలిన దానిని ముగ్గురు నిర్మాతలు పంచుకుంటారన్నమాట.

అయితే ఇలా ప్రతిపాదన పెట్టిన తరువాత, దిల్ రాజు, అశ్వనీదత్ ఆ ప్రస్తావన మరి ముందుకు తీసుకు వెళ్లకపోవడంతో పివిపి, తన కోర్టు కేసును యథాతథంగా రన్ చేసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా మహేష్ ఫ్యాన్స్ లేదా ఆయన అనునాయులు కొందరు ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేయడం ప్రారంభించారు. 18 కోట్లతో పివిపి కి సెటిల్ చేసేసారని వార్తలు పుట్టించారు. ఓ కథకు 18 కోట్లు ఇచ్చే అమాయకులు ఎవరు వుంటారన్నది వాళ్లు ఆలోచించలేదు. దీంతో పివిపి పూర్తిగా బిగుసుకుపోయారు.

మరి ఇప్పుడు మళ్లీ సిటింగ్ వేసి సెటిల్ చేసుకుంటారేమో చూడాలి. కానీ పివిపి వన్ థర్డ్ వాటాకు కాకుండా ఫిఫ్టీ పర్సంట్ ఇవ్వాలని డిమాండ్ చేసే ఆలోచనలో వున్నట్లు  తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?