మరో ప్రెండ్ షిప్ స్టోరీ

నా పేరు శివ లాంటి డిఫరెంట్ సినిమాను అందించాడు తమిళ్ డైరక్టర్ సుశీంద్రన్. హ్యాపీగా నడిచే కథ ఒక్కసారి యు టర్న్ తీసుకుని, డిఫరెంట్ జోనర్ లోకి ప్రవేశించడం, కాస్త సస్పెన్స్, కాస్త థ్రిల్లర్…

నా పేరు శివ లాంటి డిఫరెంట్ సినిమాను అందించాడు తమిళ్ డైరక్టర్ సుశీంద్రన్. హ్యాపీగా నడిచే కథ ఒక్కసారి యు టర్న్ తీసుకుని, డిఫరెంట్ జోనర్ లోకి ప్రవేశించడం, కాస్త సస్పెన్స్, కాస్త థ్రిల్లర్ లక్షణాలు సంతరించుకోవడం ఆ సినిమా స్టయిల్. ఇప్పుడు అదే సుశీంద్రన్ మళ్లీ అలాంటి ప్రయత్నం ఏదో చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

సందీప్ కిషన్, మెహరీన్ జంటగా సుశీంద్రన్ రూపొందించిన కేరాఫ్ సూర్య సినిమా ట్రయిలర్ విడుదయింది. ఇద్దరు స్నేహితుల సరదా జీవితం తీసుకున్న టర్న్, చేరుకున్న తీరం అన్నది లైన్ గా కనిపిస్తోంది. టేకింగ్ అచ్చంగా సుశీంద్రన్ స్టయిల్ లోనే వుంది.

నిజానికి మరింత ఆసక్తికరంగా, వ్యూవర్ ఫ్రెండ్లీగా ఈ ట్రయిలర్ ను కట్ చేసి వుండొచ్చు. అయితే లైన్ ను నెరేట్ చేయడం అన్నది థీమ్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. టేకింగ్ లో సుశీంద్రన్ స్టయిల్ క్లియర్ గా కనిపిస్తోంది. వినిపించిన ఒక్క ట్యూన్ బాగుంది. 

సత్య ఫన్ బాగుంటుంది. భార్య అంటే భయపడే సత్య క్యారెక్టర్ వర్కవుట్ అయ్యేలాగే వుంది. ఎప్పటి నుంచో సందీప్ కిషన్ కు ఓ సక్సెస్ బాకీ వుంది. ఈ సినిమాతో ఆ బాకీ తీరిపోతే కెరీర్ టర్నింగ్ ఇచ్చుకుంటుంది.