శర్వానంద్ సినిమాల్లో ఎక్కువగా సింగిల్ హీరోయిన్ ఉంటుంది. ఈ హీరో ఇద్దరితో రొమాన్స్ చేసిన దాఖలాల్లేవ్. అందుకే ఫస్ట్ టైం శర్వాకు ఇద్దరు ముద్దుగుమ్మల్ని ఫిక్స్ చేసినట్టున్నాడు దర్శకుడు సుధీర్ వర్మ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ ప్రాజెక్టులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.
ఒక హీరోయిన్ గా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండేను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ గా నివేత థామస్ ను అనుకుంటున్నారు. వీళ్లిద్దరికీ శర్వానంద్ తో ఇదే ఫస్ట్ మూవీ. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.
వరుసగా ఎంటర్ టైనింగ్ కథల్నే సెలక్ట్ చేసుకుంటూ వస్తున్న శర్వానంద్ ఈ సినిమాతో మరోసారి తన పాత జానర్ లోకి వెళ్తున్నాడు. సినిమా మొత్తం సీరియస్ గానే కనిపిస్తాడట. ఓ సామాన్యుడు మఫియా డాన్ గా ఎలా మారాడనే కథతో రాబోతున్న ఈ సినిమాలో మిడిల్-ఏజ్డ్ మాఫియా డాన్ లుక్ లో కూడా కనిపించబోతున్నాడు శర్వా.