మళ్లీ మరోసారి విలన్ గా ప్రకాష్ రాజ్

సైజ్ జీరో..ఊబకాయం నేపథ్యంలో తయారవుతున్న చిత్రం. ఫక్తు ఫ్యామిలీ సినిమా అనుకుంటే, ఇందులో కూడా విలన్, అతగాడి ఆట హీరో కట్టించడం వంటి వైనాలు వున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్…

సైజ్ జీరో..ఊబకాయం నేపథ్యంలో తయారవుతున్న చిత్రం. ఫక్తు ఫ్యామిలీ సినిమా అనుకుంటే, ఇందులో కూడా విలన్, అతగాడి ఆట హీరో కట్టించడం వంటి వైనాలు వున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ..సైజ్ జీరో సత్యానంద్ గా కనిపిస్తాడట. 

సన్నబడడానికి పనికి వస్తాయని నమ్మబలికి, క్యాప్స్యూల్స్ అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడట. ఆ స్కామ్ ను హీరో కనిపెట్టి,అరికట్టడం అన్న పాయింట్ సినిమాలో పార్ట్ అని తెలుస్తోంది. ప్రథమార్థం అంతా హీరోయిన్ సమస్య..అమాయకత్వం, పెళ్లి సమస్య, ఆపై ఆర్యతో పెళ్లికావడం వంటి వ్యవహారాలతో సరదానే గడిచిపోతుందంటున్నారు. 

ద్వితీయార్థంలో ఈ ప్రకాష్ రాజ్ వ్యవహారం వంటివి వుంటాయని వినికిడి.