దేవీశ్రీప్రసాద్ లుక్స్ లో ఏం మ్యాజిక్ కనిపించిందో మరి, దాదాపు అరడజను మంది నిర్మాతలు, అతగాడిని హీరోగా చేయమని కిందా మీదా పెడుతున్నారు. పైగా స్టోరీలు కూడా వినిపించారట. అయితే గమ్మత్తు ఏమిటంటే,ఇలా చెప్పిన స్టోరీలు అన్నీ దేవీకి పిచ్చ పిచ్చగా నచ్చేసాయట. కానీ దేనికి? హీరోగా చేయడానికి కాదు..మ్యూజిక్ చేయడానికి. మాంచి సబ్జెక్ట్ లు ఇవి..కాదడానికి లేదు..మాంచి హీరోలతో ఈ సినిమాలు చేయండి..నేను మాంచి సూపర్ మ్యూజిక్ ఇస్తా అంటున్నాడట.
హీరోగా చేయరా మగడా అంటే, మ్యూజిక్ ఇస్తా అంటాడేటిమి? అని తల పట్టుకుంటున్నారట నిర్మాతలు.అయినా అసలు, ఈ నిర్మాతలకేమొచ్చె? ఇప్పటికే టాలీవుడ్ లో తంపలు తంపలుగా హీరోలున్నారు..వాళ్లతో చేసుకోక, దేవీ వెంట పడడం ఎందుకో? దేవీలో అంత హీరో మెటీరియల్ వాళ్లకు ఏం కనిపించిందో?